Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ - సాయిధ‌ర‌మ్ తేజ్ టైటిల్ వ‌చ్చేసింది.. చివ‌ర‌కు అదే...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – సాయిధ‌ర‌మ్ తేజ్ టైటిల్ వ‌చ్చేసింది.. చివ‌ర‌కు అదే క‌న్‌పార్మ్‌..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ న‌టుడు, విల‌న్ పాత్ర‌లు వేసే స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌. ఇప్ట‌పికే చాలా వ‌ర‌కు షూటింగ్ కూడా పూర్త‌య్యింది.

ఇక ఈ రోజు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ముందుగా చెప్పిన‌ట్టుగానే టైటిల్ అప్‌డేట్ వ‌దిలారు. సినిమా టైటిల్‌పై ముందు నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగానే బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రతి సినిమా పై మంచి హైప్ ఉంద‌నే చెప్పాలి.

ఇక బ్లాక్ బ‌స్ట‌ర్ విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ నటిస్తున్న సినిమా కావడం తో అందరి చూపు ఈ సినిమా మీదే ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news