Moviesప‌వ‌న్ - సాయితేజ్ BRO టైటిల్ వ‌చ్చేసింది... ప‌క్కాగా ప్లాప్ సెంటిమెంట్‌...!

ప‌వ‌న్ – సాయితేజ్ BRO టైటిల్ వ‌చ్చేసింది… ప‌క్కాగా ప్లాప్ సెంటిమెంట్‌…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న కోలీవుడ్ సినిమా వినోద‌యం సీతం రీమేక్ షూటింగ్ శ‌ర‌వేగంగా న‌డుస్తోంది. కోలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ఈ రోజు రివీల్ చేశారు. ముందునుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగానే బ్రో అనే టైటిల్‌తో వీడియో వ‌దిలారు.

ఈ వీడియోలో ప‌ర‌మేశ్వ‌రుడి ఫొటోతో పాటు చివ‌ర్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు చేతులూ ప‌క్క‌కు చాపి చాలా స్టైలీష్‌గా ఉన్న స్టిల్ వ‌దిలారు. చివ‌ర్లో బ్రో అనే ఇంగ్లీష్ టైటిల్ అక్ష‌రాలు నిలువుగా వ‌స్తాయి. ఇక సినిమాను ముందు నుంచి చెపుతున్న‌ట్టుగానే జూలై 28న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించేశారు.

అన్నీ బాగానే ఉన్నాయి. ఈ టైటిల్ ఇప్పుడు పక్కాగా ప్లాప్ సెంటిమెంట్‌లో చిక్కుకుంద‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇటీవ‌ల తెలుగు హీరోల‌కు ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన సినిమాలు పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. ఇంగ్లీష్ టైటిల్‌తో వ‌చ్చిన పెద్ద సినిమాల్లో 90 వాతం పెద్ద డిజాస్ట‌ర్లే అయ్యాయి. తాజాగా ఏజెంట్ కూడా పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

నాగార్జున‌కు అయితే ఏకంగా ది ఘోస్ట్ – వైల్డ్‌డాగ్ – ఆఫీస‌ర్ పెద్ద భ‌యంక‌ర్ డిజాస్ట‌ర్లే ఉన్నాయి. ఇక ఈ సినిమా డైరెక్ట‌ర్ స‌ముద్ర‌ఖ‌నికి కూడా తెలుగులో పెద్ద స‌క్సెస్ లేదు. తెలుగులో మూడు సినిమాలు డైరెక్ట్ చేస్తూ మూడు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ కాలేదు. ఇవ‌న్నీ చూస్తుంటే బ్రో తెలుగులో ప‌వ‌న్ రేంజ్ సినిమా కాద‌నే అంటున్నారు. ఒక‌వేళ ప‌వ‌న్ ఏదైనా మ్యాజిక్ చేసి ఈ బ్రోను సూప‌ర్ హిట్ చేస్తాడా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news