Moviesసినారే సినిమాలో న‌టించకపోవడానికి కారణం అదేనా..? ఆయన నటించిన ఏకైక సినిమా...

సినారే సినిమాలో న‌టించకపోవడానికి కారణం అదేనా..? ఆయన నటించిన ఏకైక సినిమా ఇదే..!!

మ‌హా ర‌చ‌యిత‌.. మ‌హా క‌వి.. జ్ఞాన పీఠ్ అవార్డు గ్ర‌హీత సింగిరెడ్డి నారాయ‌ణ రెడ్డి గారి గురించి.. నేటి త‌రాని కి పెద్ద‌గా తెలియ‌దు. కానీ, ఆయ‌న రాసిన పాట‌లు మాత్రం ఇప్ప‌టికీ.. ఎక్క‌డో ఒక చోట వినిపిస్తూనే ఉంటా యి. ప్ర‌జ‌ల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తూనే ఉంటాయి. శివ‌రంజ‌నీ న‌వ‌రాగిణి పాట నుంచి మ‌ల్లి య‌లారా మాలిక లారా.. మౌనంగా ఉన్నారా? వ‌ర‌కు.. న‌న్ను దోచుకుందువ‌టే వ‌న్నెల దొర‌సాని పాట దాకా.. అనేక ఆణిముత్యాలు.. సినారే క‌లం నుంచి జాలువారిన‌వే

అయితే.. సినారేకి.. అన్న‌గారు ఎన్టీఆర్‌కి మ‌ధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉండేది. తెలంగాణ‌కు చెందిన సినారే.. కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేసేవారు. ఒక‌నాటి స‌భ‌లో ఆయ‌న స‌భానేతృత్వం వ‌హించాల్సి వ‌చ్చింది. ఆయ‌న చ‌క్క‌ని మాట‌.. పొందికైన మాట‌ల కూర్పు వంటివి అన్న‌గారికి ఎంతో న‌చ్చాయి. దీంతో త‌న‌ను తానే ప‌రిచయం చేసుకుని (అన్న‌గారు ఇలా ప‌రిచ‌యం చేసుకున్న‌ది ఇద్ద‌రిలోనే) సినారేను మ‌ద్రాస్ తీసుకు వెళ్లారు.

తొలి చిత్రం గులేబ‌కావ‌ళి క‌థ‌లో న‌న్ను దోచుకుందువ‌టే పాట‌ను రాయించుకున్నారు. ఆ పాట ఇప్ప‌టికీ ఆపాత మ‌ధురం. ఇలా.. అన్న‌గారితో అనేక సినిమాల్లో సినారే ప్ర‌యాణం ముందుకు సాగింది. ఈ క్ర‌మంలోనే అన్న‌గారు తాను తీసిన ఓ సినిమాలో సినారే కు అవ‌కాశం ఇవ్వాల‌ని.. న్యాయ‌మూర్తిగా న‌టించాల‌ని సూచించారు. కానీ, ఎందుకో ఆయ‌న వ‌ద్ద‌న్నారు. త‌న ఫేస్ బాగుండ‌ద‌ని.. ఆయ‌న మొహ‌మాటం లేకుండా చెప్పేవారు.

అయితే.. దాస‌రి నారాయ‌ణ‌రావుతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం.. సింగిరెడ్డి నారాయ‌ణ రెడ్డిని మ‌రిన్ని కొత్త పుంత‌లు తొక్కించింది. ఈ క్ర‌మంలోనే ఏంటి రెడ్డిగారూ.. మ‌న సినిమాలో మీరుక‌నిపిస్తే.. బాగుంటుంద‌ని అఅనుకుంటున్నా.. మ‌రిమీఇష్టం అన్నార‌ట‌… దాస‌రి. దీనికిఏం చెప్పాలో తెలియ‌క‌.. నేను ముఖానికి రంగు వేసుకోను.. ఇలానే ఉంటా. మ‌రి మీఇష్టం అన్నార‌ట రెడ్డిగారు. దీనికి దాస‌రి స‌రేన‌ని.. రెండు నిమిషాల‌పాటు తాను తీసిన ` తూర్పు ప‌డ‌మ‌ర సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. కాదు కాదు.. త‌న‌కే రెడ్డిగారు అవ‌కాశం ఇచ్చార‌ని దాస‌రిచెప్పుకొన్నారు. ఇదే నారాయ‌ణరెడ్డి న‌టించిన‌.. తొలి.. ఆఖ‌రి ది కావ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news