Moviesబాలయ్య కోసం 100 కోట్ల ఆఫర్ ని వదులుకున్న స్టార్ హీరో.....

బాలయ్య కోసం 100 కోట్ల ఆఫర్ ని వదులుకున్న స్టార్ హీరో.. నిజమైన అభిమానం అంట్ ఇదేగా..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎన్బికె 108 . వీర సింహ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత నందమూరి బాలయ్య ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్బికె 108 . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . దానికి మెయిన్ రీజన్ ఇన్నాళ్ళ వరకు మాస్ యాంగిల్ లో కనిపించిన బాలయ్య ..ఇప్పుడు కామెడీ యాంగిల్ లో కనిపించబోతున్నాడు .

అందుకే జనాలు సైతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ , శ్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరవబోతుంది శ్రీలీల అంటూ ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన న్యూ అప్డేట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ నటించబోతున్నాడు అంటూ ఓ న్యుస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

బాలయ్య పై ఉండే ఇష్టంతో అక్షయ్ కుమార్ ఏకంగా బాలీవుడ్ లో 100 కోట్లు ఆఫర్ ని సైతం రిజెక్ట్ చేసుకున్నారట . ఈ సినిమాలో కాల్ షీట్స్ కోసం అక్షయ్ ఇలాంటి పని చేశాడట. ఏది ఏమైనా సరే బాలయ్య సినిమాలో ఆఫర్ కోసం అక్షయ్ ఇలా చేయడంతో ఇప్పుడు నందమూరి అభిమానులకు సైతం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . కచ్చితంగా ఈ సినిమాలో అక్షయ్ పాత్ర జనాలకి నచ్చే విధంగానే డిజైన్ చేసి ఉంటాడు అని అనిల్ రావిపూడి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్షయ్ పాత్ర ఎలా హిట్ టాక్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news