Movies"నేను చచ్చకే అది జరిగేది".. ఫస్ట్ టైం అల్లరి నరేష్ బోల్డ్...

“నేను చచ్చకే అది జరిగేది”.. ఫస్ట్ టైం అల్లరి నరేష్ బోల్డ్ కామెంట్స్.. కడుపులో బాధ మొత్తం కక్కేశాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో అల్లరి నరేష్ పేరుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అల్లరి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో ..ఆ తర్వాత కామెడీ హీరోగా పేరు సంపాదించుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. ఒకానొక టైం లో స్టార్ హీరోల సినిమాలైనా సరే ఫ్లాప్ అవుతాయేమో కానీ అల్లరి నరేష్ నటించిన సినిమాలు మాత్రం కచ్చితంగా హిట్ అవుతాయి అనేంతలా గట్టిగా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గత కొంత కాలంలో అల్లరి నరేష్ హిట్లు అందుకోలేకపోయాడు .

ఆయన లాస్ట్ గా అందుకున్న హిట్ “నాంది” సినిమా . ఎన్నో సినిమాల ఫ్లాప్ తర్వాత ఎన్నో బాధల తర్వాత ఈ సినిమా హిట్ అయింది . ఈ క్రమంలోనే హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మరో సినిమాకి సిద్ధపడ్డాడు . మరో సినిమాని రెడీ చేసుకున్నాడు అల్లరి నరేష్ . విజయ్ కనకమెడల దర్శకత్వంలో ఉగ్రం సినిమా చేశాడు. ఈ సినిమా మే 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేష్ తన కెరీర్ కి సంబంధించిన కొన్ని కీలక కామెంట్స్ చేశారు .

ఈ క్రమంలోనే..” నా ఇన్నేళ్ల కెరియర్లో 60 సినిమాలు చేశాను . 60 శుక్రవారం చూశాను . హీరోగా నా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది .. ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది . అన్నది నాకు బాగా తెలుసు . నన్ను ఎందరో చాలా మాటలు అన్నారు . కానీ నేను ఏ విషయాన్ని పట్టించుకోలేదు . పట్టించుకుంటే ఇక్కడి వరకు వచ్చి ఉండేవాడినే కాదు ,,ఇప్పుడు చెప్తున్నా నేను నటనను వదిలే ప్రసక్తే లేదు ..నేను చనిపోతేనే నా పని అయిపోయినట్లు ..అప్పటివరకు నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. నా ఊపిరి ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటాను ” అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు .

ఈ క్రమంలోనే నరేష్ ని ఎంత టార్చర్ చేసి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేస్తాడు అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంత్స్ చేస్తున్నారు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పాత్రలు పడితే చేయాలి అని అనుకుంటున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు అల్లరి నరేష్ తాజాగా నాగార్జున సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడు అన్న న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news