Moviesథ‌మ‌న్‌కు బ‌ద్ధకం బాగా పెరిగిపోయిందా… ఇలా అయితే ఢ‌మాల్‌నే ప‌డే రోజు...

థ‌మ‌న్‌కు బ‌ద్ధకం బాగా పెరిగిపోయిందా… ఇలా అయితే ఢ‌మాల్‌నే ప‌డే రోజు ద‌గ్గ‌ర్లోనే ..!

టాలీవుడ్ లో హీరోల మీద హీరోయిన్ల మీద ఎక్కువగా రూమర్లు వినిపించడం కామన్ గా జరుగుతుంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ మీద కూడా ఇటీవల కాలంలో గాసిప్పులు ఎక్కువగా చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇవి సీరియస్గా తీసుకోవలసినవి కాకపోయినా.. ఖచ్చితంగా థ‌మ‌న్ కెరీర్ మీద ప్ర‌భావం చూపేవే. థ‌మ‌న్‌ ఇప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.

మహేష్ బాబు అయినా ప్రభాస్, బాలయ్య, బన్నీ ఇలా స్టార్ హీరోల సినిమాలకు వరుసగా మ్యూజిక్ ఇస్తున్నాడు. మహేష్ బాబు – ప్రభాస్ – బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు అన్నీ థ‌మన్‌ చేతిలో ఉన్నాయి. అయితే ఇంకా ఏ ఒక్కరు సినిమాకు ఒక్క ట్యూన్ కూడా ఇవ్వలేదన్న చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇటీవల కాలంలో మ‌నోడికి బద్ధకం బాగా పెరిగిపోయింది అని అంటున్నారు.

సినిమా రిలీజ్ టైం దగ్గర పడే సమయంలో ఏదో ఒక ట్యూన్ ఇచ్చి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారింది అట. ఇక థ‌మన్ మనసు దృష్టి అంతా చేసే పని మీద ఉండటం లేదట. మనోడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు గంటలకొద్దీ టైం చూసుకుని క్రికెట్ ఆడుతూ ఉంటాడు అట. ఒక్కసారి తాను ఉండే హోటల్ పై అంతస్తులో కారిడార్ లో తన స్టాఫ్‌ను బౌలింగ్ చేయమని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని కూడా గుసగుసలు ఉన్నాయి.

ఇక క్రికెట్ తర్వాత థ‌మన్‌కు ఆహా ఇండియన్ ఐడియల్ షో మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. దానికోసం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక కొందరు యువ దర్శకులు థ‌మన్‌ను తమ సినిమాలకు మంచి ట్యూన్లు ఇస్తాడని తరచూ పబ్బులకు పార్టీలకు తీసుకుని వెళుతున్నారట.

ఇలా థ‌మన్ తన వృత్తి మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదని.. బద్ధకం బాగా పెరిగిపోయింది అని తన తీరు మార్చుకోకపోతే థ‌మన్ ఢ‌మాల్‌ను కింద పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కొందరు సినిమా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి థ‌మన్ ఇది బుర్రకు ఎక్కించుకుంటాడో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news