Moviesచైతన్య-సమంతల కంటే ఆ బిచ్చాగాడే బెటర్.. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా..?

చైతన్య-సమంతల కంటే ఆ బిచ్చాగాడే బెటర్.. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి స్టేటస్ .. ఎవరి రేంజ్ ఎలా మారిపోతుందో .. ఎవరు గెస్ చేయలేరు అంటూ ఉంటారు సినీ ప్రముఖులు . ఎగ్జాక్ట్గా అదే విధంగా జరిగింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత హీరో అక్కినేని నాగచైతన్య కెరియర్ విషయాలలో . మనకు తెలిసిందే ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత ఎవరి లైఫ్ వారిది అంటూ బ్రతికేస్తున్నారు . అయితే రీసెంట్ గా ఒక నెల వ్యవధి గ్యాప్ లోనే .. వీరిద్దరు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి .

మల్టీ టాలెంటెడ్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన “శాకుంతలం” సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరమ చెత్త టాక్ ను దక్కించుకుంది . అంతేకాదు మేకర్స్ కి హ్యూజ్ రేంజ్ లో నష్టాలు తీసుకొచ్చింది . అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే నాగచైతన్య కస్టడి సినిమా రిలీజ్ అవ్వడం కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే ఈ సినిమా హిట్ అవుతుందని అంత అనుకున్నారు . సీన్ కట్ చేస్తే అంతా షాక్ .

శాకుంతలం సినిమాకన్నా పరమ చెత్త టాక్ ని దక్కించుకొనింది. నాగచైతన్య కెరియర్ లోనే బిగ్ డిజాస్టర్ గా నిలిచింది . ఇలాంటి క్రమంలోనే ఈ రెండు సినిమాలకు ఏం మాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బిచ్చగాడు 2 మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసింది. మొదట్లో టాక్ అటూఇటూ గా ఉన్న ఆ తర్వాత కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మి కుమ్మి పడేసాడు . దీంతో సోషల్ మీడియాలో చైతన్య – సామ్ ల కంటే బిచ్చగాడు బెటర్ అని..

కంటెంట్ విషయంలో కానీ మెసేజ్ విషయంలో కానీ.. మంచి లైన్ తీసుకున్నారు అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు తెలుగులో కూడా బిచ్చగాడు 2 ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడం.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం . తెలుగులో ఎంతో మార్కెట్ ఉన్న చైతన్య – సామ్ కంటే బిచ్చగాడు సినిమా వసూలు రాబట్టడం వారిని అవమానించినట్టే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి . అంతేకాదు చైతన్య – సామ్ లు కూడా కధల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని .. లేకపోతే రానున్న రోజుల్లో మరింత డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news