Movies"ఛ‌త్ర‌ప‌తి" ట్రైలర్: తెలుగు-హింది కి అదే తేడా..మిగతాది అంతా సేమ్ టూ...

“ఛ‌త్ర‌ప‌తి” ట్రైలర్: తెలుగు-హింది కి అదే తేడా..మిగతాది అంతా సేమ్ టూ సేమ్ ..బెల్లంబాబు బాబు డిట్టో దించేసాడురోయ్(వీడియో)..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చత్రపతి . ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది . ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్ టాప్ మోస్ట్ హిట్ గా సంచలనాన్ని క్రియేట్ చేసింది . ఇప్పటికి ప్రభాస్ ని ఈ స్థాయిలో నిలబెట్టిన సినిమా ఏది అంటే అందరికీ ముందుగా చత్రపతి. ఈ సినిమాపై కన్నేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు , దీనికి సంబంధించిన ట్రైలర్ను రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమా మే 12న 2023 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు . వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆస్ ఇట్ ఈజ్ తెలుగులో ఎలా ఉందో అలాగే దింపేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి బెల్లంకొండ బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం మ్యాచ్ కాలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతే కాదు మ్యూజిక్ పరంగా కూడా ఎక్కడ అప్ టు ద మార్క్ లేవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .అయితే తెలుగు చత్రపతి సినిమాకి హిందీ చత్రపతి సినిమాకి ఒకే ఒక తేడాగా కనిపిస్తుంది .

తెలుగు చత్రపతి సినిమాలో హీరో కుటుంబం శ్రీలంక నుంచి ఇండియాకు కాధీసులుగా వస్తారు . అయితే ఇక్కడ హిందీ ఛత్రపతి సినిమాలో మాత్రం పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు చూపించారు. సినిమా మొత్తానికి అదే హైలైట్ గా అనిపించింది . భాగ్యశ్రీ నటన ఒక్కటే బాగుంది. హీరోయిన్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని చెప్పాలి . మరి ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమేజ్ కి ఈ సినిమా టు ఓవర్ యాక్టింగ్ గా ఉంది అంటూ పలువురు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం రాజమౌళి ఏ విధంగా తెరకెక్కించారు.

ఆస్ ఇట్ ఇస్ డిట్టోగా దింపేశాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ ఎంతో కష్టపడ్డారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతుంది . ఆ విషయంలో అయితే హాట్సాఫ్ చెప్పాలి బాడీని బాగా బిల్డప్ చేశాడు .కాగా తెలుగు చత్రపతికి సంగీతం పెద్ద ప్లస్ గా అయితే హిందీ ట్రైలర్ లో. సాంగ్స్ చూస్తుంటే సినిమాకి అదే మైనస్లు అయ్యేలా ఉంది అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి చూద్దాం మరి మే 12న హిందీ చత్రపతి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తల రాత ని ఏ విధంగా మారుస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news