Newsమెహ్రీన్ కుళ్లి కుళ్లి పోయేలా చేసిన మాజీ ప్రియుడు భ‌వ్య భిష్ణోయ్‌…...

మెహ్రీన్ కుళ్లి కుళ్లి పోయేలా చేసిన మాజీ ప్రియుడు భ‌వ్య భిష్ణోయ్‌… మామూలు షాక్ ఇవ్వ‌లేదుగా…!

నార్త్ బ్యూటీ అయిన మెహరీన్ తెలుగులో చాలా సినిమాలలో నటించింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు చేసిన ఆమె ఇక్కడ ఎందుకో స్టార్ హీరోయిన్ కాలేదు. ఉన్నంతలో ఎఫ్2 – ఎఫ్3 సినిమాలు మాత్రమే ఆమెకు కాస్త మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఎఫ్3 హిట్ అయినా కూడా ఆ తర్వాత మెహరీన్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. చాలా ముద్దుగా ఉండే ఈ భామ రీసెంట్గా బరువు తగ్గి కాస్త నాజూగ్గా తయారయింది. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నా ఆమెను ఎవరూ పట్టించుకోవటం లేదు.

అయితే గత ఏడాది ఈ భామ హర్యానా మాజీ ముఖ్యమంత్రి భ‌జ‌న్‌లాల్‌ మనవడు భవ్య భిష్ణోయ్‌తో ఎంగేజ్మెంట్ జరిగాక కూడా పెళ్లి రద్దు చేసుకుని పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించాలన్న కండీషన్ పెట్టడంతో అది నచ్చని భవ్య కుటుంబం ఆమెను కోడలుగా చేసుకునేందుకు అంగీకరించలేదని.. అందుకే వీరిద్దరూ విడిపోయారన్న ప్రచారం జరిగింది. 2021 మార్చిలో మెహరీన్ – భవ్య ఎంగేజ్మెంట్ జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

పైగా భవ్య భిష్ణోయ్‌తో బ్రేకప్ తర్వాత మెహ‌రీన్ తాను చాలా హ్యాపీగా ఉన్నానని…ఈ ఎంగేజ్మెంట్ ర‌ద్దు చేసుకుని మంచి పని చేశానని అంటూ భవ్యపై సెటైర్లు వేసింది. అయితే ఇప్పుడు భవ్య బిష్ణోయ్‌ మెహరీన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఏకంగా ఐఏఎస్ అధికారిణితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. 2022లో జరిగిన బై ఎలక్షన్లలో బిజెపి తరఫున పోటీ చేసిన భవ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఈ క్రమంలోనే ఐఏఎస్ ఆఫీసర్ పరి బిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడు అడుగులు వేయబోతున్నాడు. తాజాగా హర్యానాలో వీరి ఎంగేజ్మెంట్ చాలా వైభవంగా జరిగింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా మోకాళ్ళ మీద కూర్చుని తనకు కాబోయే భార్యకు ప్రపోజ్ చేస్తున్న ఫోటో అయితే అద్భుతంగా ఉంది.

ఏది ఏమైనా మెహరీన్ తో విడిపోయిన భ‌వ్య‌ ఏకంగా ఐఏఎస్ అధికారిణిని భార్య‌గా చేసుకుంటూ మెహరీన్ కు పెద్ద షాకే ఇచ్చాడని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న భవ్య భార్య ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో రాజకీయంగా అతడి ఎదుగుదలకు చాలా యూజ్‌ అవుతుందని… మంచి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news