Movies"ఏ ఆ ప్రశ్న హీరోలను అడగచ్చుగా..ఆ దమ్ము మీకు లేదా..?".. పబ్లిక్...

“ఏ ఆ ప్రశ్న హీరోలను అడగచ్చుగా..ఆ దమ్ము మీకు లేదా..?”.. పబ్లిక్ లోనే రెచ్చిపోయిన శ్రియ శరణ్..అడిగి కడిగేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు పోతూ ఉంటారు ..కానీ కొందరే అభిమానుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా వరుసగా కంటెంట్ ఉన్న పాత్రను చూస్ చేసుకుంటూ అటు గ్లామరస్ గాను ఇటు ట్రెడిషనల్ గాను రెండిట్లోనూ మెప్పించింది .

కాగా శ్రేయ శరణ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న ఇప్పటికీ ఇండస్ట్రీలో అరాకొరా అవకాశాలు దక్కించుకుంటుంది అంటే దానికి మెయిన్ రీజన్ ..ఆమె అందాలు అని చెప్పక తప్పదు . పెళ్లయి ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా శ్రేయ ఎంత హాట్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయ శరణ్ ని జర్నలిస్ట్ ఇదే ప్రశ్న ఓపెన్ గా అడిగేసారు . “పెళ్లయ్యాక కూడా మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి..?” అంటూ అందరి ముందే ప్రశ్నించారు . దీనిపై స్పందిస్తూ శ్రియ కూడా” మీరు ఇలాంటి ప్రశ్నలు హీరోయిన్స్ నే అడుగుతారా..? హీరోలను అడిగే ధైర్యం దమ్ము మీకు లేదా..?” అంటూ రివర్స్ కౌంటర్ వేసింది .

దీంతో ఒక్కసారిగా రిపోర్టర్ సైతం షాక్ అయ్యారు . అంతేకాదు ఆమె మాట్లాడుతూ..” నా ఫ్రెండ్స్ చాలా మంది నన్ను మెచ్చుకున్నారు బిడ్డ పుట్టక కూడా ఇంతలా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నావంటే గ్రేట్ నమ్మలేకపోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు. కాగా అందం ఒక్కటే ఇంపార్టెంట్ అని నేను అనుకోవడం లేదు.. హెల్తీగా కూడా ఉండాలి ..ఆ రెండో నాకు ఇంపార్టెంట్ ” అంటూ చెప్పకు వచ్చింది . ఈ క్రమంలోనే శ్రియ అందం విషయంలోనే కాదు ఎంత బోల్డ్ గా నటిస్తుందో అంత బోల్ఘ్ గా కూడా కౌంటర్ వేయగలరు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా శ్రియా ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పడంలో నెంబర్ వన్ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ప్రెసెంట్ తెలుగులో రెండు సినిమాలు.. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ కెరియర్ ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళుతుంది శ్రియ శరణ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news