Moviesదీనిని అభిమానం అంటారా..? గీతు రాయల్ చేసిన పనికి ఫైర్...

దీనిని అభిమానం అంటారా..? గీతు రాయల్ చేసిన పనికి ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!!

గీతూ రాయల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జనాలకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత తన పేరు ను మరింత హైలెట్ చేసుకుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో గీతు ఆడిన డబల్ గేమ్స్ ఎంతలా ట్రోలింగ్కి గురిచేసాయో మనందరికీ తెలిసిందే .

కప్పు కొట్టాలని ఆశతో వెళ్లిన అమ్మడు సగంలోనే వెనక్కి వచ్చేసింది. బయటకి వచ్చిన తర్వాత కూడా షోపై చేసిన కామెంట్స్ గీతు ని మరింత డీగ్రేడ్ అయ్యేలా చేసాయి. రీసెంట్గా అల్లు అర్జున్ బర్త డే సందర్భంగా.. ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచిన దేశముదురు సినిమాను 4క్ వర్షెన్ లో రీరిలిజ్ చేసారు.

థియేటర్లో గలాటా గీతూ నానాహంగా చేసింది. ఎంతలా అంటే సీట్లో కూర్చోకుండా ముందుకు వచ్చి డాన్స్ చేస్తూ రచ్చ రంబోలా చేసింది . దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతుంటే ..మరి కొందరు పక్క వాళ్ళని సినిమా చూడనీయకుండా నీ గోల ఏంటి పాప అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి గీతూ ఏ మాత్రం మారలేదని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news