Moviesలైగ‌ర్ సినిమా డిజాస్ట‌ర్‌కు ఎన్టీఆర్ వార్ 2 కు ఇంత లింక్...

లైగ‌ర్ సినిమా డిజాస్ట‌ర్‌కు ఎన్టీఆర్ వార్ 2 కు ఇంత లింక్ ఉందా ?

టాలీవుడ్ లో యంగ్ క్రేజీ హీరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా సినిమా లైగ‌ర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ తొలి సినిమాతోనే రిలీజ్ కి ముందు భారీ హైప్‌ తెచ్చుకున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ స్వయంగా నిర్మించడం విశేషం.

సినిమా రిలీజ్ కి ముందు ఎలాంటి హైప్‌ వచ్చిందో ? తెర సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే విజయ్ పరువు మొత్తం పోయింది. అటు పూరి జగన్నాథ్ ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను బాలీవుడ్ లో మరో అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

అయితే వార్‌ సినిమాలో విలన్ గా ఎన్టీఆర్‌ను ఎంపిక చేయటానికి ముందు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చర్చలు జరిపారట. అసలు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ చర్చలు జరిగాయని.. అయితే లైగ‌ర్ డిజాస్టర్ అవడంతో విజయ్ ఈ ఆఫర్‌ తిరస్కరించినట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే లైగ‌ర్ తర్వాతే అదే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే మరో పాన్ ఇండియా సినిమా కూడా ప్లాన్ చేసుకున్నాడు.

కానీ లైగ‌ర్ దెబ్బతో ఆ ప్రాజెక్టుకు దండం పెట్టేసాడు. అలా లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ ఈ ఆఫర్‌ తిరస్కరించటం.. ఎన్టీఆర్ ఈ క్రేజీ ప్రాజెక్టులోకి వచ్చి చేరటం చకచకా జరిగిపోయాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులోకి అలా ఎంటర్ కావడంతోనే సినిమా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news