Moviesవార్ 2 కంటే ముందు ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ… ఆ స్టార్...

వార్ 2 కంటే ముందు ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ… ఆ స్టార్ హీరో సినిమాతోనే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 30వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ – సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుంది. ఇక బుధవారం ఎవరూ ఊహించిన విధంగా ఎన్టీఆర్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్, బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కి మల్టీ స్టార్ సినిమాపై నిన్న వచ్చిన అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

2019 లో వచ్చిన వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిర్మాత ఆదిత్య చోప్రా ఎన్టీఆర్‌ను నటింపజేసేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నాడని ఈ రోల్ చేసినందుకు ఆదిత్య చోప్రా ఎన్టీఆర్‌కు ఏకంగా రు. 75 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వార్డు సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అందరూ భావించారు.

అయితే ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. వార్ 2 సినిమా కంటే ముందే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందట. అది కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాతో కావడం మరో విశేషం. సల్మాన్ ఖాన్ హీరోగా టైగర్ సినిమా మూడో భాగం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడు. అంటే టైగర్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ పరిచయం చేసి.. దానిని వార్ 2 సినిమాలో కంటిన్యూ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

ఏది ఏమైనా ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ చాలా కొత్తగా ఉండబోతోంది. ఇక ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ ఎంట్రీ సినిమాకు బ్రహ్మాస్త్ర సినిమా డైరెక్టర్ ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ పై గత ఆరు నెలలుగా చర్చలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ గురించి ప్రకటన వచ్చిన వెంటనే ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన పోల్ చూస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ పోల్‌తో ఎన్టీఆర్‌కు కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఉండడంతో వార్‌ సినిమాకు సౌత్ ఇండియాలో కూడా అదిరిపోయే బిజినెస్ జరగనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news