Moviesగేమ్ ఛేంజ‌ర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ మిస్ అయిన స్టార్ హీరో...

గేమ్ ఛేంజ‌ర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ మిస్ అయిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో తిరుగులేని బ్లాక్ బ‌స్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్‌ ఇండియా హీరో అవడంతో పాటు పాన్ ఇండియా మార్కెట్ సొంతం చేసుకున్నాడు. అలాగే గ్లోబల్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నాడు.

ఇక త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన రాంచరణ్ అక్కడ ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని సైతం ఆకర్షించాడు. ఎందరో హాలీవుడ్ హీరోలను కూడా కలిశాడు. దీంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ వైడ్‌ గా స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న తన 15వ సినిమాపై మామూలు అంచనాలు లేవు.

కీయాఆరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాకు ఇటీవల గేమ్ ఛేంజర్ అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. వాస్తవంగా ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

దిల్ రాజు, దర్శకుడు శంకర్ పవన్ కళ్యాణ్ ను కలిసి స్టోరీ నెరేట్ చేసినప్పుడు పవన్ ఈ స్టోరీకి తనకంటే రామ్ చరణ్ బాగా సూట్ అవుతాడని సూచించాడు అట. పవన్ సలహా మేరకు అప్పుడు రామ్ చరణ్ కు కథ చెప్పగా నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పేసాడట. అలా గేమ్ ఛేంజ‌ర్ లో పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి రామ్ చరణ్ హీరోగా వచ్చి చేరాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news