Moviesబన్నీ బర్త డే స్పెషల్ : ప్రతి పుట్టినరోజుకు ఖచ్చితంగా అలా...

బన్నీ బర్త డే స్పెషల్ : ప్రతి పుట్టినరోజుకు ఖచ్చితంగా అలా చేస్తాడట..అందుకే ఐకాన్ స్టార్ అనేది..!!

ఈరోజు అల్లు అర్జున్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజు , ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు . సోషల్ మీడియా వ్యాప్తంగా.. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు . మరీ ముఖ్యంగా కేరళ లో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోయే అల్లు అర్జున్ అక్కడ కూడా ఆయన ఫ్యాన్స్ బన్నీ బర్తడే ను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప టీజర్ ని సోషల్ మీడియా లో హాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు . బన్నీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఫాన్స్ ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే బన్ని తన ప్రతి పుట్టినరోజు నాడు తూచా తప్పకుండా సరే చిన్నప్పటి నుంచి ఆయన పుట్టిన రోజుకు కచ్చితంగా తన తల్లి తండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకుంటాడట.

ఈ రోజుల్లో ట్రెండ్ మారింది పుట్టిన రోజు అయిన ..పెళ్ళి రోజు అయిన హగ్ ఇచ్చి..షేక్ హ్యాండ్ తో విష్ చేసుకుంటున్నారు. అయితే బన్నీ మాత్రం తల్లి దండ్రుల కాళ్లకి నమస్కారం చేసి మరి ఆశీర్వాదాలు తీసుకుంటారట. అలా చేసిన తరువాతనే మిగతా పనులను స్టార్ట్ చేస్తాడని అల్లు ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఇప్పటికి అల్లు అర్జున్ కి తన తండ్రి అల్లు అరవింద్ అంటే గౌరవం – భయం.. అదేవిధంగా ఉన్నాయట. అల్లు అర్జున్ ఇప్పటికీ తండ్రికి భయపడతాడా అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. ప్రెసెంట్ సోషల్ మీడియాలో బన్నికి సంబంధించిన బర్త డే విషెస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news