Moviesజబర్ధస్త్ కమెడియన్ ఓవర్ యాక్షన్ .. ఇంద్రజకు ఎక్కడో మండింది.. షో...

జబర్ధస్త్ కమెడియన్ ఓవర్ యాక్షన్ .. ఇంద్రజకు ఎక్కడో మండింది.. షో నుండి వెళ్లిపోయింది..అసలు ఏమైందంటే..?

బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా.. జబర్దస్త్ షోకి ఉన్న క్రేజ్ …. రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. క్రియేటివిటీ మరి ఏ షోకి రాదని చెప్పాలి. ప్రతి వారం సరికొత్త కంటెంట్ తో సరికొత్త టీం తో జనాలను ఫూల్స్ చేస్తూ వచ్చే జబర్దస్త్.. ఈసారి కూడా జనాలను బకరాలను చేసే ఓ ఎపిసోడ్ ని తీసుకొచ్చింది అంటున్నారు జబర్దస్త్ హేటర్స్.బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అంతే నెగెటివిటీని కూడా సంపాదించుకుంది.

దానికి మెయిన్ రీజన్ షోలో చేసే ఓవర్ యాక్షన్ ..నెగెటివిటీ కంటెంట్ ఒకటైతే .. వల్గర్ పంచెస్ మరొకటి . ఎప్పటిలాగే షోలో టిఆర్పి రేటింగ్స్ కోసం హైడ్రామాన్ని స్కిట్ రూపంలో వేశారు. ఈ క్రమంలోని వెంకీ టీం వేసిన స్కిట్ కి ఇంద్రజ తక్కువ మార్కులు వేసింది . దీంతో స్టేజ్ పైనే ఇంద్రజను వెంకి స్ట్రెయిట్ గా అడిగేసారు. పోయినసారి పది మార్కులు ఇచ్చారు . ఈసారి 9 మార్కులు ఇచ్చారు . ఎందుకు మేడం..? అంటూ అడిగారు.

ఈ క్రమంలోని ఇంద్రజ సైతం సీరియస్ అయింది . పోయినసారి బాగా చేసావ్..ఈసారి బాగా చేయలేదు..అయినా కృష్ణ భగవాన్ కూడా ఉన్నారుగా ఆయన అడగొచ్చుగా అంటారు . అంతే వెంకి చెప్తున్న సమాధానం ఇంద్రజకు కోపం తెప్పించింది . ఈ క్రమంలోని ఏకంగా ఈ షో ఇక చేయకూడదు అన్నంత కోపంగా సీట్లో నుంచి లేచి బయటకు వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. ప్రోమో ఇక్కడతో ఎండ్ అయింది . ఈ క్రమంలోని ఇది ఒక హై డ్రామా అని కేవలం ఒక్క మార్కు కోసం ఇంద్రజని కంటెస్టెంట్ ఆ విధంగా అడుగుతారా ..? ఇంతకన్నా వెర్రితనం ఒకటుందా..? అంటూ జనాలు మరోసారి జబర్దస్త్ పై బూతు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news