Moviesబాల సుబ్రమణ్యం కెరీర్ నాశనం చేస్తానన్న ఆ తెలుగు స్టార్ హీరో..చివరికి...

బాల సుబ్రమణ్యం కెరీర్ నాశనం చేస్తానన్న ఆ తెలుగు స్టార్ హీరో..చివరికి అంతపని చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో గాన గంధర్వుడిగా పేరు సంపాదించుకున్న బాలసుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో వందల సినిమాల్లో వేలపాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు బాలసుబ్రమణ్యం. మరిముఖ్యంగా ఒకానొక టైంలో బాలసుబ్రమణ్యం పాటలు పాడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అని నమ్మేవారు . అంతేకాదు బడా డైరెక్టర్స్ కూడా హీరోలకు ప్రియారిటి ఇవ్వకుండా సినిమాలో పాటలకు ప్రాధాన్యత ఇచ్చి బాలసుబ్రమణ్యమే పాటలు పాడే విధంగా సినిమాలో ప్లాన్ చేసుకున్నారంటే.. ఆయన క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు . అంతే కాదు రెమ్యూనరేషన్ విషయంలో సైతం సరాసరి స్టార్ హీరోలకి ధీటుగా ఇంకా పక్కాగా చెప్పాలంటే స్టార్ హీరోలకి మించిపోయే విధంగానే బాలసుబ్రమణ్యం పాతితోషకం అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బడా హీరోగా పేరు సంపాదించుకున్న ఇప్పుడు సీనియర్ హీరో ఒకప్పుడు యంగ్ హీరో ..బాలసుబ్రహ్మణ్యం తన సినిమాకి పాటలు పాడడానికి కాల్ షీట్స్ లేవు అన్నారని,, చెప్పడంతో ఆయనపై పగపట్టాడట. ఎంతలా అంటే తనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మిగతా హీరోలకు సైతం బాలసుబ్రమణ్యం కు ఆఫర్స్ ఇవ్వద్దు.. బాలసుబ్రమణ్యం కి హెడ్ వెయిట్ పెరిగింది అంటూ మిగతా హీరోలకి చెప్పి వాళ్ళ సినిమాలకు అవకాశం ఇవ్వకుండా.. వాళ్ల సినిమాలకి కూడా పాటలు పడే అవకాశం ఇవ్వకుండా చేశారట.

అయితే ఇదే విషయం తెలుసుకున్న బాలసుబ్రహ్మణ్యం హీరోకే డైరెక్ట్ గా ఫోన్ చేసి అడిగి కడిగిపాడేసారట . “నేను డబ్బుల కోసం పాటలు పాడడం లేదు.. నా ఆనందం కోసం పాటలు పాడుతున్నాను ..డబ్బులు ఇవ్వకుండా కూడా నేను పాటలు పాడగలను.. మీరు డబ్బులు ఇవ్వకుండా నటించగలరా ..అది మీకు నాకున్న వ్యత్యాసం.. కళామతల్లి బిడ్డలం.. ఒకే గూడు కింద ఉంటున్నాం.. ఇలా పగలువద్దు అంటూ బాలసుబ్రమణ్యం కూల్ గా ఆ ప్రాబ్లం ను సాల్వ్ చేసారట . కానీ ఆ హీరో మాత్రం బాలసుబ్రహ్మణ్యం పై సమయం వచ్చినప్పుడల్లా ఏదో ఒక నెగటివ్ కామెంట్స్ చేస్తూనే ఉండేవాడట . ఆశ్చర్యమేంటంటే చనిపోయే ముందు వరకు కూడా బాలసుబ్రమణ్యం ఆ స్టార్ కి పాటలు పాడిందే లేదు . అంతకు ముందు ఆయన సినిమాలకి పాటలు పాడి హిట్స్ ఇచ్చిన బాలసుబ్రమణ్యం .. ఆ తర్వాత ఆ హీరో తో మాట్లాడిన సందర్భాలు కూడా లేవు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news