MoviesANR-Savithri ఏఎన్నార్ ప్రేమ‌లో సావిత్రి... ఆమె కెరీర్ నాశ‌నానికి ఇది కూడా...

ANR-Savithri ఏఎన్నార్ ప్రేమ‌లో సావిత్రి… ఆమె కెరీర్ నాశ‌నానికి ఇది కూడా కార‌ణ‌మైందా…!

ఏఎన్నార్ ప్రేమ‌లో సావిత్రి… ఆమె కెరీర్ నాశ‌నానికి ఇది కూడా కార‌ణ‌మైందా…!
మహానటి సావిత్రి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఆమె ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు.. తెలుగు ప్రజల హృదయాల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇప్పటికే మనం సావిత్రిని తలుస్తున్నాం అంటే ఆమె తెలుగు సినిమాలతో.. తెలుగు ప్రజలపై ఎలాంటి ? బలమైన ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు. సావిత్రి ఎంతో గొప్ప మహానటి. అయితే ఆమె అప్పటికే రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న జెమినీ గణేషన్ ప్రేమలో పడటంతో కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది.

ఎంతో గొప్పగా బతికిన ఆ మహానటి కెరీర్ చివరి రోజుల్లో.. ఎంతో దయనీయ స్థితిలో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. సావిత్రి చివరి రోజులు తలుచుకుంటే ప్రతి ఒక్కరి హృదయం భరువెక్కి పోతుంది. ఇదిలా ఉంటే సావిత్రి స్వతహాగా అక్కినేని నాగేశ్వరరావుకు వీరాభిమాని. ఆమె చిన్నప్పుడే ఏఎన్ఆర్ ను చూసి సినిమాల్లోకి రావాలని ఉత్సాహం చూపించారు. సినిమాల్లోకి వచ్చాక తాను అభిమానించే నటుడుతోనే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు.

దేవదాసు సినిమాలో వారిద్దరి ప్రేమను తెరమీద చూసిన చాలామంది వీఈరు నిజమైన ప్రేమికులు అనే సందేహం వ్యక్తం చేశారు. చాలామంది అప్పటి సినీ విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో పడిపోయారని అంటారు. అసలు మూడు సంవత్సరాల పాటు ఏఎన్నార్.. సావిత్రి కాల్ సీట్లు అన్ని బుక్ చేసేసారు. దీంతో సావిత్రి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మరే హీరోతోను చేసే అవకాశం లేకుండా పోయింది.

తెలుగులో ఎన్టీఆర్ – తమిళంలో శివాజీ గణేషన్, ఎంజీఆర్ లాంటి హీరోలు సావిత్రితో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపేవారు. అయితే ఆమె డేట్లు అన్ని నాగేశ్వరరావు వరుసగా బుక్ చేసుకున్నారు. చివరకు ఎన్టీఆర్ అయితే అమ్మ నాతో ఒక సినిమా చేయమని ప్రాధాయపడుతూ అడిగినా నేనేం చేయను అండి.. ఆయన డేట్లు మొత్తం బుక్ చేసేసారు అని చెప్పటం మినహా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేద‌ట సావిత్రి.

అలా సావిత్రి జీవితాన్ని ఏఎన్ఆర్ కంట్రోల్ చేశారని.. దీనితో ఏఎన్నార్ తో తప్ప ఆమె మరో హీరోతో సినిమా చేసే అవకాశం లేకుండా పోయిందని.. ఇది కూడా సావిత్రిని మిగతా హీరోలకు దూరం చేసిందని అంటారు. అందుకే సావిత్రి కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో మందికి సాయం చేసిన ఎన్టీఆర్, అటు శివాజీ గణేషన్ లాంటి వాళ్ళు ఆమెను పెద్దగా పట్టించుకోలేదని అంటూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news