MoviesNTR30 అమ్మదీనమ్మ..జాన్వీ-ఎన్టీఆర్ సినిమా సెలక్ట్ చేసింది అందుకేనా..? ఏం బుర్ర రా...

NTR30 అమ్మదీనమ్మ..జాన్వీ-ఎన్టీఆర్ సినిమా సెలక్ట్ చేసింది అందుకేనా..? ఏం బుర్ర రా బాబు..!!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఈ ఆశగా.. ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది . ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించడానికి మంచి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు కొరటాల శివ . నిజానికి ఎప్పుడో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది .. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్గా నే నందమూరి హీరో తారకరత్న మరణించారు . ఈ కారణంగా లూడా తారక్ తన సినిమా షూటింగ్ ని వాయిదా వేసుకున్నారు .

మంచి ముహూర్తం చూసి ఎన్టీఆర్ 30 సినిమాను అఫీషియల్ గా లంచనంగా ప్రారంభించడానికి ఎన్టీఆర్ సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలోని నిన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు . ఆమె బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ థర్టీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు కొరటాల శివ . ఈ క్రమంలోనే చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూనే హాట్ నెస్ ను ఎక్కడా మిస్ చేయకుండా జాగ్రత్త పడ్డారు కొరటాల శివ . పద్ధతిగా లంగా వోణీలో కనిపిస్తూనే.. నడుమ భాగాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ సినిమా పై మరింత హైప్స్ ఇచ్చారు కొరటాల .

అయితే ఈ క్రమంలోని జాన్వికపూర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. తెలుగులో ఎన్నో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి అవకాశాలు వచ్చాయి. రాంచరణ్ – అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ ఇలా బోలెడు మంది బిగ్ స్టార్స్ తో కూడా ఎంట్రీ ఇవ్వడానికి అవకాశాలు వచ్చాయి. కానీ జాన్వి కపూర్ ఎందుకు ఎన్టీఆర్ నే చూస్ చేసుకుందా..? అనేది ఇప్పుడు ఇండస్ట్రిలో హార్ట్ టాపిక్ గా మారుతుంది.అందుతున్న సమాచారం ప్రకారం జాన్వికపూర్ కావాలనే ఎన్టీఆర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి ఇన్నాళ్లు వెయిట్ చేసినట్లు తెలుస్తుంది .

తన తల్లి శ్రీదేవికి ఎన్టీ రామారావు గారు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. తెరపై వాళ్ళు జతకట్టిన ప్రతి కాంబో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది . ఈ క్రమంలోనే అలాంటి ఓ క్రేజీ రికార్డ్ ని సెట్ చేయడానికి ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ జాతకట్ట బోతుందని ..అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ – శ్రీదేవి కాంబో ఎలా హిట్ అయిందో.. ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ – శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కాంబో కూడా అదే విధంగా హిట్ అవ్వాలని పకడ్బందీగా ప్లాన్ చేసి మరి జాన్వికపూర్ ఈ సినిమాను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది . దీంతో మరోసారి జాన్వి కపూర్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news