Moviesmanoj-mounica మంచు మ‌నోజ్ - భూమా మౌనిక పెళ్లి ఎంత సీక్రెట్‌గా...

manoj-mounica మంచు మ‌నోజ్ – భూమా మౌనిక పెళ్లి ఎంత సీక్రెట్‌గా అంటే… పెళ్లి గెస్టుల్లో ఊహించ‌ని ట్విస్ట్‌…!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒకటయ్యారు. ఫిలింనగర్ లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 8. 30 గంట‌లకు మనోజ్.. మౌనికకు మెడలో మూడు ముళ్ళు వేసి తన భార్యగా స్వీకరించారు. వాస్తవానికి ఈ వివాహం అటు మనోజ్ కు ఇటు మౌనికకు రెండో పెళ్లి. మనోజ్ ముందుగా తన అన్న విష్ణు భార్య వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నాడు.

నాలుగేళ్ల కాపురం తర్వాత 2019లో మనస్పర్ధల నేపథ్యంలో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రణతి రెడ్డి అమెరికాకు వెళ్ళిపోయింది. ఇటు మౌనిక విషయానికొస్తే దివంగత రాజకీయ నేతలు అయిన భూమా నాగిరెడ్డి – శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె. మౌనిక అక్క అఖిలప్రియ మాజీ మంత్రి. మౌనికకు తిరుపతి మూలాలు ఉండి బెంగళూరులో వ్యాపారం చేస్తున్న పారిశ్రామికవేత్త గణేష్ రెడ్డితో పెళ్లి జరగడంతో పాటు ఒక బాబు కూడా పుట్టాడు.

వారిద్దరి ప్రయాణం సఖ్యంగా లేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. గతం నుంచి మోహన్ బాబు.. భూమా ఫ్యామిలీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ పరిచయంతోనే వీరిద్దరి పాత స్నేహం చిగురించి ప్రేమలో పడ్డారు. ఇక మనోజ్ – మౌనిక సరికొత్త దాంపత్య జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఈ పెళ్లికి హాజరైన అతిధుల లిస్టు చూస్తే చాలా షాకింగ్ గా ఉంది. అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి.

వారిలో వైయస్ విజయలక్ష్మి, టీజీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్ నిక్కి గల్రానీ, విజ‌య‌వాడ‌కు చెందిన‌ వైసీపీ యువనేత దేవినేని అవినాష్ లాంటి వారికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. వారు అంద‌రు వచ్చారు. ఇక మనోజ్ అంటే ఎంతో ఇష్టపడే అక్క మంచు లక్ష్మి తన ఇంట్లోనే అతడి పెళ్లిని జరిపించింది. పెళ్లి పనులు అన్ని దగ్గరుండి చూసుకుంది. మనోజ్‌ను, మౌనికను పెళ్ళికొడుకును.. పెళ్లికూతురును చేస్తూ పెళ్లిలో అంతా తానై వ్యవహరించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news