MoviesNamratha-Mahesh Babu న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌కు ఈ ముద్దు పేరు ఉందా… ఇన్నాళ్ల‌కు...

Namratha-Mahesh Babu న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌కు ఈ ముద్దు పేరు ఉందా… ఇన్నాళ్ల‌కు సీక్రెట్ బ‌య‌ట‌కొచ్చింది…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ మాజీ హీరోయిన్ న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ప్రేమించి 2005లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మామూలుగా వీరిద్దరివి వేర్వేరు దారులు.. మహేష్ బాబు టాలీవుడ్ లో బలమైన ఘట్టమనేని ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సూపర్ స్టార్ గా ఉన్నారు. అటు నార్త్‌లో న‌మ్ర‌తా మిస్ ఇండియా గా బాలీవుడ్ లో అప్పుడప్పుడే ఛాన్సులు దక్కించుకుంటుంది. వీరిద్దరూ కలిసి బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో నటించారు.

వంశీ సినిమా షూటింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడటం.. దాదాపు 5 సంవత్సరాలు ప్రేమించుకుని 2005లో ముంబైలో పెళ్లి చేసుకోవడం జరిగింది. బాలీవుడ్లో న‌మ్ర‌తా కు మంచి రిలేషన్లు ఉన్నాయి. ఆమె సంజయ్ దత్, మహేష్ మంజ్రేకర్ లాంటి స్టార్లతో కలిసి పని చేసింది. అప్పట్లో నమ్రత ఫేమస్ మోడల్ కూడా. వంశీ సినిమా తర్వాత నమ్రత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన అంజి సినిమా కూడా చేసింది.

ఇదిలా ఉంటే ఆమెకు బాలీవుడ్ లో చిన్ను అనే ముద్దు పేరు కూడా ఉందట. అసలు ఇప్పటివరకు ఈ పేరు బయటకు రివీల్ కాలేదు. తాజాగా వెంకటేష్ – రాణా కలిసి చేసిన వెబ్ సిరీస్ రామా నాయుడు. కరణ్ – సుప‌ర్ణ్‌ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో వెంకీ – రాణా తొలిసారి కలిసి నటించారు. ఇది మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.. ఈ సందర్భంగా రానా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రస్తుతం తెలుగు సినిమాలు హిందీలో బాగా వర్కౌట్ అవుతున్నాయని నా రెండో సినిమా ఘాజి కూడా హిందీలో చేశా.. మనం భాష పేరుతో సినిమాను వేరు చేసుకుంటున్నాం… త్వరలో ఆ సరిహద్దులు కూడా చెరిగిపోతాయని రానా చెప్పాడు. కొద్దిరోజుల క్రితం తన జీవితంలో ఓ సంఘటన జరిగిందంటూ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. బాలీవుడ్లో రాణా మిత్రుడు ఒకరు బాహుబలి సినిమా గురించి చెప్పినప్పుడు అందులో హీరో ఎవరు ? అని అడిగారట. ప్రభాస్ అని చెప్పగా అసలు ప్రభాస్ ఎవరు నాకు టాలీవుడ్ లో చిన్నూ భర్త ఒక్కరు మాత్రమే తెలుసు అని చెప్పాడట.

దీంతో రాణాకు అసలు చిన్ను ఎవరో ? అర్థం కాక కాస్త ఆలోచనలో పడ్డాడట. ఆ తర్వాత ఆ మిత్రుడు చెప్పిన మాటలను బట్టి చిన్ను అంటే నమ్రత శిరోద్కర్ అని అర్థమైందట. అసలు నమ్రత భర్తగా మహేష్ బాబు తెలియటం ఏంటని తాను షాక్ కావాల్సి వచ్చిందని చెపాడు. నాలుగైదు ఏళ్ళు ఆగితే మా ఆర్మీ అంతా బాలీవుడ్లో దిగిపోతుందని తాను తన మిత్రుడికి చెప్పానని.. ఇటీవల ఆయనను కలిసినప్పుడు నేను చెప్పింది జరిగింది కదా అనడంతో ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారని రాణా చెప్పాడు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత నమ్రత శిరోద్క‌ర్ కు బాలీవుడ్ లో చిన్న అనే ముద్దు పేరు ఉందని బయటికి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news