Moviesఎన్టీఆర్ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌… ఈ సారి ఆ హీరోతోనూ ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌రే..!

ఎన్టీఆర్ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌… ఈ సారి ఆ హీరోతోనూ ప‌క్కా బ్లాక్‌బ‌స్ట‌రే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత ఏడాది త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారి మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రు. 1200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్‌కు కెరీర్ పరంగా తొలి పాన్ ఇండియా హిట్ సినిమాగా నిలిచిపోయింది.

త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా ఒక రేంజ్ లో ఎలివేట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ‌ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ – సలార్ సినిమాల‌ దర్శకుడు ప్రశాంత నీల్‌ దర్శకత్వంలోనూ మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టుకుంటూ వెళుతున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వస్తోంది. మరో మల్టీస్టారర్ సినిమాలో నటించే విషయమే కూడా ఎన్టీఆర్ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రేజీ కాంబినేష‌న్ ఏదో కాదు ఎన్టీఆర్ – రామ్‌చ‌ర‌ణ్‌దే. త్రిబుల్ ఆర్ సినిమాలో న‌టించిన వీరిద్ద‌రు మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ సినిమా కోసం జోడీ క‌డుతున్నార‌ని అంటున్నారు.

అదే నిజ‌మైతే టాలీవుడ్ సినీ అభిమానుల‌కు అంత‌కు మించిన పండ‌గ ఏం ? ఉంటుంది. కోలీవుడ్ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ కాంబోలో వీరిద్ద‌రి మ‌ల్టీస్టార‌ర్ ఉండ‌బోతోందంటున్నారు. వాస్త‌వానికి వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని ఎప్ప‌టి నుంచో అంటున్నా.. ఇప్పుడు ఏకంగా చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా అన‌డంతో ఫ్యీజులు ఎగిరి పోతున్నాయి. అయితే ఇది ఇప్పుడు ఎనౌన్స్ అవుతుంద‌న్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news