Moviesపూజా హెగ్డే పాలిట శనిలా దాపురించిన స్టార్ బ్యూటీ.. మరో గోల్డెన్...

పూజా హెగ్డే పాలిట శనిలా దాపురించిన స్టార్ బ్యూటీ.. మరో గోల్డెన్ ఆఫర్ హుష్ కాకి..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే కెరియర్ ప్రెసెంట్ ఎలాంటి పొజీషన్ లో ఉందో మనందరికీ బాగా తెలిసిందే. ఏది ముట్టుకున్న సరే బ్లాస్టింగ్ రేంజ్ లో పేలుతూ.. ఆమె పేరు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే జనాలు ఆమెను పట్టించుకోవడమే మానేశారు. డైరెక్టర్స్ కూడా అంతే పూజ హెగ్డే కు అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించత్లేదు. ఇలాంటి క్రమంలోనే పూజ హెగ్డే ఒక అడుగు వెనక్కి వేసి కాల్ చేసి మరి అవకాశాలు అడుగుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇదే క్రమంలో గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించాల్సిన ఆఫర్ ని తన ఖాతాలో వేసుకొని కొన్ని అనివార్య కారణాల చేత రిజెక్ట్ చేసిన పూజ హెగ్డే ..మళ్లీ ఆఫర్ కోసం డైరెక్టర్ కు కాల్ చేసి రిక్వెస్ట్ చేసిందట. ఈ క్రమంలోనే టైం చూసి కొట్టాడు డైరెక్టర్ అంటూ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “ఉస్దాత్ భగత్ సింగ్”. టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ హరిష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా అనుకున్నారు అంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి.

హరిష్ శంకర్ కూడా పరోక్షంగా అమ్మడు ఈ సినిమాలో హీరోయిన్ అంటూ హింట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ..పూజ హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వినిపించాయి . ఈ సినిమాలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీలను సెలెక్ట్ చేసుకున్నాడు హరిష్ అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు రేపో మాపో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేస్తుంది అంటూ సినీ వర్గాలలో ఓ టాక్ నడిచింది .

కాగా ఇప్పుడు పూజా హెగ్డే తన తప్పు తెలుసుకుని డైరెక్టర్ కి కాల్ చేసి మరి ఆఫర్ ఇవ్వమంటూ అడిగిందట. ఈ క్రమంలోనే పూజ హెగ్డే మాటలకు మెల్ట్ అయిన హరీష్ శంకర్ .. సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ తెలుస్తుంది . అయితే మొదటి హీరోయిన్గా మాత్రం శ్రీలీలనే ఫిక్స్ అయ్యాడట . ఈ క్రమంలోనే పూజా హెగ్డే సెకండ్ హీరోయిన్ అయితే నేను చేయను ..ఫస్ట్ హీరోయిన్ గానే చేస్తాను అంటూ రెండోసారి సైతం ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట.

ఇలా గతంలో మహేష్ బాబు సినిమా లో కూడా శ్రీ లీల ఇదేవిధంగా పూజా హెగ్డే స్క్రీన్ టైంకి దెబ్బేసింది . త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ నే శ్రీలీల నటనకు అందానికి మెల్ట్ అయిపోయి పూజా హెగ్డే ను దూరం పెట్టి మరి ఎక్కువ ప్రిఫరెన్స్ శ్రీలీల కి ఇస్తున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఇదే క్రమంలో మరోసారి ఇలాంటి ఓ ఇన్సిడెంట్ జరగడంతో సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే వ్స్ శ్రీలీల వార్ పిక్స్ కి చేరుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . టోటల్గా పూజా ఖాతాలో నుంచి మరో గోల్డెన్ ఆఫర్ హుష్ కాకి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news