Movies"పోరంబోకు వెధవల్లారా".. ప్రభాస్ ఫ్యాన్స్ ని కెలికిన స్టార్...

“పోరంబోకు వెధవల్లారా”.. ప్రభాస్ ఫ్యాన్స్ ని కెలికిన స్టార్ హీరో ఫ్యాన్స్.. ఇంతకంటే ఘోర అవమానం మరొకటి ఉంటుందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ ఎంత పెరిగిందో తెలియదు కానీ ..నెగెటివిటీ మాత్రం తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరో ఫ్యాన్స్ ఏవిధంగా కొట్టుకుని చస్తున్నారో.. మనందరికీ బాగా తెలిసిందే. స్టార్ హీరోస్ మాత్రం జాన్ జిగిడి దోస్తుల చక్కగా హ్యాపీగా ఉంటే వాళ్ళను ఆరాధించి.. అభిమానించే ఫ్యాన్స్ మాత్రం బద్ధ శత్రువుల టార్గెట్ చేసి మరీ సోషల్ మీడియాలో నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అంటూ కొట్టుకు చస్తున్నారు .

ప్రజెంట్ అలాంటి వార్ నే జరుగుతుంది.. కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ..పాన్ ఇండియా హీరో గా పాపులారిటి తెచ్చుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది . అది ఇదే.. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న నటులు మనందరికీ తెలిసినవారే. అయితే ప్రభాస్ మాత్రం ఈ ఫోటోలో కూసింత డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. చేతులు, ముఖం పెద్దదిగా కనిపిస్తూ ఎవరో ఈ ఫోటోని మార్ఫింగ్ చేశారు అని ..చూడగానే చెప్పే అంతలా వికారంగా ఉన్నాడు .

దీనంతటికి కారణం రజినీకాంత్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. మనకు తెలిసిందే రజనీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా జైలర్. ఈ సినిమాలో కన్నడ హీరో శివకుమార్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు . రీసెంట్గా దిగిన ఓ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఎందుకో తెలియదు కానీ దానికి డూప్లికేట్ పిక్ ఒకటి ఒరిగినల్ గా కంటే జెట్ స్పీడ్ లో వైరల్ అవుతుంది.

అటు రజినీ, ఇటు శివ కుమార్ బాగానే ఉన్నా..మధ్యలో ఉన్న వేరే వ్యక్తి ఫోటోలో ప్రభాస్ ఫోటోని పెట్టి దారుణంగా క్రియేట్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసారు. ఈ క్రమంలోనే రెబెల్ ఫాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ “ఎవ్వడ్రా ఇలాంటి ఫొటోస్ ని మార్ఫ్ చేసిన పోరంబోకు వెధవలు ” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఎందుకు ప్రభాస్ ని ఇలా టార్గెట్ చేసి ఇంత వికారంగా క్రియేట్ చేసారు అన్నది మాత్రం తెలియలేదు . ఎవరికైనా ప్రభాస్ ఫాన్స్ కి ఈ ఫోటో చూడగానే కడుపు మండిపోతుంది . తల పెద్దదిగా చూడడానికి చాలా వికారంగా ఉన్నాడు ప్రభాస్ .

ఈ క్రమంలోని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పలువురు స్టార్ తెలుగు హీరోస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. మా తెలుగు హీరోని ఈ విధంగా ట్రోల్ చేస్తారా..? అంటూ సదురు ఫోటోని ట్యాగ్ చేస్తూ మరీ దారుణంగా బూతులు తిడుతున్నారు. అయితే ఎందుకు కోలీవుడ్ జనాలు ప్రభాస్ ని టార్గెట్ చేశారు అన్నది మాత్రం తెలియట్లేదు. కొందరైతే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంటున్నాడని.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు కోలీవుడ్ జనాలు ఇలా కావాలని ప్రభాస్ ని డీ గ్రేడ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అంటున్నారు . అసలు ఈ ఫోటో ఎవరు మార్ఫ్ చేశారు ..? ఎందుకు మార్ఫింగ్ చేశారు..? కావాలని ఫాన్స్ మధ్య గొడవలు పెట్టడానికి చూస్తున్నారా ..? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక్క ఫోటో ఇద్దరు స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news