Moviesమళ్ళీ యువరాణిలా అనసూయ మారాలంటే .. ఖచ్చితంగా అది చేయాల్సిందేనా..? తప్పదా..?

మళ్ళీ యువరాణిలా అనసూయ మారాలంటే .. ఖచ్చితంగా అది చేయాల్సిందేనా..? తప్పదా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అనసూయ ఉ అన్న ట్రోల్ చేస్తున్నారు ఊ ఊ అన్న ట్రోల్ చేస్తున్నారు. అనసూయ ను మరీ ముఖ్యంగా ఆంటీ అంటూ ట్రోల్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అనసూయ సైతం ఎక్కడ తగ్గేదేలే అన్న రేంజ్ లో అందరికీ ఇచ్చుపడేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆమెను ఆంటీ అంటూ టార్గెట్ చేసి ట్రోల్ చేసే వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఏకంగా పోలీస్ కేసును కూడా పెట్టేసింది .

దీంతో అనసూయ దెబ్బకు భయపడి పోయిన జనాలు గప్ చుప్ అయిపోయి కోసం సైలెంట్ గా తప్పుకునేశారు . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రీల్స్ తో ఆకట్టుకుంటున్న అనసూయకు ..సినిమా ఆఫర్లు రావడం లేదు. ఇటు బుల్లితెరపై కూడా చెప్పుకునే ఆఫర్స్ ఏదీ రావడం లేదు. అసలు వెండితెరపై బుల్లితెరపై అనసూయ కనిపించడమే మానేసింది . కేవలం సోషల్ మీడియాకి పరిమితం అయింది . ఈ క్రమంలోనే ఆమె ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అన్న న్యూస్లు వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ క్రమంలోనే అనసూయ ఫ్యాన్స్ ఆమెకి సజీషన్స్ ఇస్తున్నారు . మళ్ళీ నువ్వు ఇదివరకు అనసూయలా మారాలంటే కచ్చితంగా జబర్దస్త్ లోకి వెళ్లాల్సిందే అని.. జబర్దస్త్ లో ఉన్నప్పుడు నీకు ఆఫర్లు కూడా వచ్చేటివి అని ..అయితే ఏ ముహూర్తాన జబర్దస్త్ మానేసావో అప్పటినుంచి నీకు ఆఫర్స్ రావడం లేదని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు బాడీ షేమింగ్ కామెంట్స్ విషయంలో నువ్వు మల్లెమాలతో మాట్లాడుకొని మళ్ళీ నువ్వు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కరెక్ట్ అంటూ ఆమె ఫ్యాన్స్ సజిస్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . చూడాలి మరి అనసూయ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఎలా ఇస్తుందో..? తన లైఫ్ని ఎలా మార్చుకోబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news