Moviesప‌వ‌న్ - బాల‌య్య దెబ్బ‌తో ఇండియ‌న్ బుల్లితెర షేక్‌.. రికార్డుల‌న్నీ బ్రేక్‌…!

ప‌వ‌న్ – బాల‌య్య దెబ్బ‌తో ఇండియ‌న్ బుల్లితెర షేక్‌.. రికార్డుల‌న్నీ బ్రేక్‌…!

ఒక‌రేమో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, మ‌రొక‌రు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అస‌లు వీరిద్ద‌రి క్రేజ్ సింగిల్‌గా ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎవ‌రి నోట విన్నా కూడా జై బాల‌య్య మంత్రం వ‌స్తోంది. ఫ‌స్ట్ టైం బాల‌య్య క్రేజ్ దెబ్బ‌తో వీర‌సింహారెడ్డి యావ‌రేజ్ కంటెంట్‌తో వ‌చ్చి గట్టి పోటీ మ‌ధ్య‌లో కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. బాల‌య్య కెరీర్‌లో ఫ‌స్ట్ టైం ఓ సినిమాకు ఫ‌స్ట్ డే రు. 54 కోట్ల వ‌సూళ్లు అంటే మామూలు విష‌యం కాదు

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్‌, మానియా గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌క్క‌ర్లేదు. అలాంటిది వీరిద్ద‌రు క‌లిసి టాక్ షో చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో ? చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త రాత్రి అదే జ‌రిగింది. ర‌చ్చ రంబోలా అయిపోయింది. ఇండియ‌న్ బుల్లితెర రికార్డులు షేక్ అయిపోయాయి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫ‌స్ట్ టైం ఓ టాక్ షోలో… అందులోనూ ఓటీటీ షోలో క‌నిపించ‌డ‌మే సంచ‌ల‌నం అనుకుంటే.. అందులోనూ బాల‌య్య హోస్ట్ చేసిన టాక్ షో లో క‌నిపించ‌డం పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యింది.

గ‌త ప‌క్షం రోజులుగా ఊరిస్తూ వ‌స్తోన్న ప‌వ‌న్ – బాల‌య్య ఎపిసోడ్ గ‌త రాత్రి ఆహాలో 9 గంట‌ల‌కు స్ట్రీమింగ్ అయ్యింది. అంత‌కుముందు ప్ర‌భాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన వెంట‌నే ఆహా స‌ర్వ‌ర్ క్రాష్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌కు ముందే భారీ రెస్పాన్స్ ఊహించిన ఆహా టీం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. అయినా కూడా యాప్‌లో భారీ ట్రాఫిక్‌తో కొన్ని టెక్నిక‌ల్ ఇష్యూలు వ‌చ్చినా కూడా ఈ ఎపిసోడ్ దుమ్ము దులిపేసే రేంజ్‌లో రికార్డులు సాధించింది.

ఈ ఎపిసోడ్ దెబ్బ‌తో కొన్ని నిమిషాల్లోనే హ‌య్య‌స్ట్ యాప్ లాంచ్‌ల‌తో పాటు ఫ‌స్ట్ 90 నిమిషాల్లో అత్య‌ధిక స్ట్రీమింగ్ మినిట్స్‌తో పాటు గంట‌, రెండు గంట‌ల‌కు కూడా హ‌య్య‌స్ట్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డులు అన్నీ ఈ ఎపిసోడ్ ఖాతాలోనే ప‌డ్డాయి. ప‌వ‌న్ – బాల‌య్య క‌లిస్తే ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డులు సైతం చెల్లాచెదురు అయిపోవాల్సిందే అని ఈ ఎపిసోడ్ ఫ్రూవ్ చేసింది. ఏదేమైనా ఈ భారీ ఎపిసోడ్ అంచ‌నాలు అయితే నూటికి నూరు శాతం అందుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news