MoviesDanush ధనుష్ "సార్" సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరో..వెంకి అట్లూరి...

Danush ధనుష్ “సార్” సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరో..వెంకి అట్లూరి అంతలా బాధపడ్డారా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి కంటెంట్ అయినా సరే మిడిల్ క్లాస్ పీపుల్ కి అర్థమయ్యే విధంగా నటించడంలో ధనుష్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . ఈ విషయం మనందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా ధనుష్ తెలుగులో స్ట్రైట్ గా చేసిన మూవీ సార్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే బాక్స్ ఆఫీస్ వద్ద హ్యుజ్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది .

అఫ్కోర్స్ సినిమాలో చెప్పుకోతగ్గ కమర్షియల్ కంటెంట్స్ ఏమీ లేవు ..రొమాన్స్ – ముద్దు – సీన్లు హగ్గులు అస్సలకి ఉండవు ..అయినా కానీ పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే సినిమాని నెట్టుకొచ్చాడు . సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది వెంకీ అట్లూరి మెయిన్ డైరెక్షన్ అని చెప్పాలి . నేటి సమాజంలో విద్యా వ్యవస్థను ఎంత కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు.. ఎంత దారుణంగా దిగిపోయారు.. ఎంత దారుణంగా విద్యాసంస్థ నడుస్తుంది అన్న విషయాన్ని క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించాడు వెంకీ .

అయితే ఈ సినిమా స్టోరి ను మొదటగా అనుకున్నప్పుడు వెంకి అట్లూరి అనుకున్న హీరో తెలుగు నాచురల్ స్టార్ నాని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాని అయితే ఈ కథకు బాగా ఆప్ట్ గా సెట్ అవుతాడని వెంకీ భావించారట . స్టోరిని నానికి చెప్పగా.. కథలోని కొన్ని పాయింట్స్ ఆయనకు నచ్చలేదట. ఈ క్రమంలోనే పాయింట్స్ ని చేంజ్ చేయమంటూ డైరెక్టర్కు సజెషన్ ఇచ్చారట . అయితే వెంకీ అట్లూరి అందుకు ఒప్పుకోకపోవడంతో నాని ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అయితే ఎంతో ఆశగా నాని కోసం రాసుకున్న స్టోరిని ఆయన రిజెక్ట్ చేయడంతో.. వెంకీ అట్లూరి బాధపడ్డారట. ఫైనల్లీ అందరి హీరోల చేతులు మారి సార్ స్టోరి ధనుష్ చేతిలో పడింది . ఈ కథకు పూర్తి న్యాయం చేశాడు ధనుష్ అంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news