Movies"ఎవడ్రా..అలా కూసింది".. కోపంతో ఊగిపోయిన రమా ప్రభ..!!

“ఎవడ్రా..అలా కూసింది”.. కోపంతో ఊగిపోయిన రమా ప్రభ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తొక లేని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫేక్ థంబ్ నెయిల్స్ తో తప్పుడు వార్తలు రాసే వాళ్ళ లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. బతికున్న మనుషులనే చచ్చిపోయారు అంటూ ఫేక్ థంబ్ నైల్స్ పెట్టి దారుణంగా ఉన్న వీడియోలను ఇప్పటికే మనం చూసాం. కాగా రీసెంట్గా నటి రమాప్రభ చనిపోయింది అంటూ కొందరు .. నటి రామప్రభ దీనస్థితిలో ఉంది అంటూ మరికొందరు ..దారుణంగా వార్తలు రాసుకోచ్చారు. యూట్యూబ్లో ఫేక్ థంబ్ నెయిల్స్ ఫోటోని పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె మంచి కోరుకునే వ్యక్తులు కంగారుపడుతూ ఆమెకు మెసేజ్లు పెట్టడంతో అఫీషియల్ గా దీనిపై స్పందించింది. కోపంతో ఊగిపోతూ రమాప్రభ అలాంటి ఫేక్ థంబ్ నెయిల్స్ పెట్టే వారిపై మండిపడింది. ఈ క్రమంలోని రమాప్రభ మాట్లాడుతూ..” నేను అడుక్కునే స్థితిలో ఉన్నానా..? దీన పొజిషన్లో ఉన్నానా..? నాకు ఆ కర్మ పట్టలేదు.. నాకు ఇల్లు ఉంది .. అయినా నా సొంత యూట్యూబ్ ఛానల్ లో నా ఇల్లు ..నా కుటుంబాన్ని చూపించాను ..అలాంటి కర్మ నాకు ఏమి పట్టలేదు ..వయసు అయిపోయింది ..సినిమా అవకాశాలు వస్తున్న చేయలేని పొజిషన్లో ఉన్నాను..”

“ఈ క్రమంలోనే రెస్ట్ తీసుకుంటూ నా మిగతా జీవితాన్ని గడుపుతున్నాను ..ప్రశాంతంగా హ్యాపీగా నా బట్టలు నేనే కొట్టుకుంటూ ..నాకు నచ్చినవి నేనే వండుకుంటూ ..ఎంజాయ్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు మీకు నేను దీన పొజిషన్లో ఉన్నాను అని .. ఇండస్ట్రీలో ఉండే పెద్దవాళ్లు నాగార్జున , పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఇప్పటికే నాకు హెల్ప్ చేస్తున్నారు. వారి అండదండలు ఉండగా నాకు ఏ ప్రాబ్లం రాదు. నేను హ్యాపీగా ఉన్నాను.. బ్రతికే ఉన్నాను ..దయచేసి ఇలా దీనస్థితిలో ఉన్న అంటూ తప్పుడు వార్తలు ఇక రాయకండి ” అంటూ రిక్వెస్ట్ చేసింది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news