Moviesఅక్కినేని ఇంట మరో మంట.. ఏ జన్మలో ఏం పాపం చేసారో..?

అక్కినేని ఇంట మరో మంట.. ఏ జన్మలో ఏం పాపం చేసారో..?

సినిమా ఇండస్ట్రీలో నాలుగు ఫ్యామిలీలు వారసత్వంగా పుచ్చుకొని సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న విషయం తెలిసిందే. తాతల తర్వాత తండ్రి .. తండ్రి తర్వాత కొడుకులు.. కొడుకులు తర్వాత మనవళ్ళు అంటూ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. ఒకరి తర్వాత ఒకరు సినిమా ఇండస్ట్రీ లోకి వస్తూ.. నాలుగు ఫ్యామిలీలు ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నాయి . వాళ్ళల్లో ఒకటే అక్కినేని ఫ్యామిలీ . కాగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది.

అక్కినేని ఫ్యామిలీ ఏం మాట్లాడిన తప్పే .. మాట్లాడకపోయినా తప్పే మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యను అఖిల్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా ధమాకా సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ కి చేరడంతో అక్కినేని హీరోస్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని ఇంటిపేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే అక్కినేని ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లం వచ్చినట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది . ఇప్పటికే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే .

అంతే కాదు అక్కినేని అఖిల్ కూడా నిశ్చితార్ధం చేసుకొని అమ్మాయితో బ్రేకప్ చెప్పేసుకున్నాడు . కాగా ఇద్దరికీ రెండో పెళ్లి చేయడానికి నాగార్జున రెడీగా ఉన్నారట . అంతేకాదు నాగచైతన్య తన రెండో భార్యను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ మీడియాలో వార్తలు అనిపిస్తున్నాయి . అయితే అఖిల్ కి కూడా మళ్ళీ పెళ్లి చేయడానికి అమల ఫోర్స్ చేస్తున్న సరే అఖిల్ ఒప్పుకోవట్లేదట . ఈ క్రమంలోనే అఖిల్ పెళ్ళికి ఒప్పుకుంటేనే నాగచైతన్య రెండో పెళ్లి జరగాలి అంటూ అక్కినేని అమల క్రేజీ కండిషన్ పెట్టిందట .

దీంతో ఒక్కసారిగా అక్కినేని కాంపౌండ్ లో తగాదాలు మొదలయ్యాయి . ఈ క్రమంలోనే నాగర్జున, అక్కినేని అఖిల్ ని పెళ్ళికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట . అయితే అఖిల్ అక్కినేని మాత్రం పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు అంటూ తేల్చి చెప్పేసాడట . దీంతో నాగచైతన్య రెండో పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అక్కినేని ఫ్యామిలీను కొంతమంది జనాలు సింపతిగా చూస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఇప్పటివరకు ఇంటి కోడలు లేదు..మనవళ్లు లేరు అంటూ చెప్పుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news