MoviesOfficial : ఫైనల్లీ..ఆ సినిమా తోనే ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.....

Official : ఫైనల్లీ..ఆ సినిమా తోనే ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. ఎంత స్పెషల్ అంటే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మీరాజాస్మిన్ .. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయింది . పెళ్ళికి ముందు టాలీవుడ్ లో ఉండే బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న మీరా జాస్మిన్..అతి తక్కువ సినిమాల్లో నటించి కూడా హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న హీరోయిన్గా పేరు సంపాదించుకుంది .

అప్పట్లో ఉన్న హీరోయిన్స్ లో వరుసగా కాల్ షీట్లు ఇస్తూ సినిమాలకు కమిట్ అవుతున్నా.. సరే మీరా జాస్మిన్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ కంటెంట్ ఉన్న సినిమాలనే చూస్ చేసుకుంది. ఇప్పటివరకు మనం మీరాజాస్మిన్ చేసిన సినిమాలు చూస్తే ఒక సినిమాలో చేసిన పాత్ర మరో సినిమాలో చేసి ఉండదు అలాంటి కధలని చూస్ చేసుకుంది. రీసెంట్ గానే తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది.

ఈ క్రమంలోనే ఆమె ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కథను ఫైనల్లీ సెలక్ట్ చేసుకుంది. ఆమె అనుకున్న కథ దొరకడంతో సినిమా ఇండస్ట్రీలోకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సరైన టైమ్ అంటూ రంగంలోకి దిగింది . విమానం అనే చిత్రంతో మీరాజాస్మిన్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు . ఈ సినిమాలో మీరాజాస్మిన్ ఇప్పటివరకు చేయని సరికొత్త రోల్ ని చేయబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా కోసం మీరాజాస్మిన్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుందట.

ఈ సినిమా కోసం మీరా చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది . బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీరాజాస్మిన్ కి మంచి గుర్తింపు తీసుకొస్తుందని ..ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారట . అంతేకాదు ఇప్పటికే ఎన్బికె 108 సినిమాలో ఆఫర్ ఇచ్చిన రిజెక్ట్ చేసింది ..పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసింది.. అయితే బడాస్టార్ సినిమాలను రిజెక్ట్ చేసి ఈ సినిమాను ఓకే చేయడం పట్ల ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news