MoviesNavdeep: లవర్ ని పరిచయం చేసిన నవదీప్.. అమ్మాయి ఎవరో తెలిస్తే..జుట్టు...

Navdeep: లవర్ ని పరిచయం చేసిన నవదీప్.. అమ్మాయి ఎవరో తెలిస్తే..జుట్టు పీకోవాల్సిందే..!!

టాలీవుడ్ హీరోగా పేరు సంపాదించుకున్న నవదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గౌతమ్ ఎస్ఎస్సి అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ మిడిల్ క్లాస్ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . ఏ కథ చేసిన మిడిల్ క్లాస్ అబ్బాయిలకు కనెక్ట్ అయ్యే విధంగా ఫాలో అవుతూ జనాలు దగ్గర విపరీతంగా పొగిడించుకునేసారు.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కెరియర్ పిక్స్ లో ఉండగానే నవదీప్ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు . ఆ తర్వాత వచ్చిన అరాకోరా సినిమాలతో మళ్ళీ తన పాపులారిటీని సంపాదించుకోవాలని చూశాడు . సినిమా ఇండస్ట్రీలో చేసినిమా లు స్తున్నప్పుడే ఆయన గే అంటూ ప్రచారం జరిగింది. మరికొన్ని రోజుల తరువాత ఓ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడని .. కానీ ఆమె అతగాడిని రిజెక్ట్ చేసిందని ..నా స్టేటస్ కి నువ్వు సరిపోవు అంటూ ముఖాన్నే చెప్పేసింది అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పటివరకు దీనిపై స్పందించని నవదీప్ .. తాజాగా ఇన్స్టా స్టోరీలో ఓ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్ ను పోస్ట్ చేశారు . అందులో ఖుషి అహుజా అనే అమ్మాయిని ట్యాగ్ చేసి ఎంగేజ్మెంట్ రింగ్ తో ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు . వాలెంటైన్స్ డే రోజున పోస్ట్ చేసేసరికి నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అంత ఫిక్స్ అయిపోయారు . అయితే అమ్మాయి ఫోటో బ్లర్ గా ఉంది.

ఫైనల్లీ నవదీప్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ నవదీప్ ఫాన్స్ ఆయనకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పరేశారు నవదీప్ ఫ్రెండ్స్. ఆయన ప్రాంక్ చేసాడని.. నవదీప్ అభిమానులను ఫూల్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . నిజంగా నవదీప్ పెళ్లి చేసుకోవట్లేదు అని ఆయన ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడని తెలుస్తుంది . ఇదంతా వెబ్ సిరీస్ లో భాగంగానే ఆయన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చేశాడంటూ ఆయన ఫ్రెండ్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో నవదీప్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news