Moviesవామ్మో ..SSMB29 ప్రీ ప్రొడక్షన్ కే అన్ని కోట్లా..? మహేశ్ ఫ్యాన్స్...

వామ్మో ..SSMB29 ప్రీ ప్రొడక్షన్ కే అన్ని కోట్లా..? మహేశ్ ఫ్యాన్స్ ఇక భూమి మీద నిలుస్తారా..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు.. తీవ్ర శోకాన్ని దిగమింగుకుని అభిమానుల కోసం తన సినిమా రెగ్యులర్ షూట్ ని ప్రారంభించాడు . రీసెంట్ గానే సర్క్కారు వారి పాట సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు.. ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ప్రతిష్టాత్మకమైన సినిమా ఎస్ఎస్ఎంబీ28 షూటింగ్లో బిజీగా ఉన్నాడు .

ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న మహేష్ బాబు రెండో షెడ్యూల్లో భాగమై ఉన్నాడు . కాగా ఈ సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు ఫస్ట్ టైం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు . బాహుబలి , ఆర్ఆర్ఆర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళితో సినిమా అంటే మాటలు కాదు. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చిన కాల్ షీట్స్ మాత్రం భారీగానే ఇవ్వాలి .

కాగా ఎలాంటి హీరోతోనైనా సినిమా చేస్తే అతగాడికి స్పెషల్ లైఫ్ ఇచ్చే రాజమౌళి .. మహేష్ బాబు తో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఫుల్ అడ్వెంచర్స్ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి ప్లస్ పాయింట్ మహేష్ బాబు బాడీ అంటూ రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ను నెగటివ్ రోల్ కి చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించిన క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే ఏకంగా 17 కోట్లకు పైగా మేకర్స్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది . ఇది నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ఒక రికార్డు అనే చెప్పాలి. ఇలాంటి న్యూస్ విన్న తర్వాత మహేష్ బాబు అభిమానులు ఆగుతారా.. భూమి మీద నిలుస్తారా .. నెవర్ గాల్లో తేలిపోవాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news