MoviesLaya Daughter ల‌య కూతురు హీరోయిన్‌గా వ‌స్తోందా… ఆ స్టార్...

Laya Daughter ల‌య కూతురు హీరోయిన్‌గా వ‌స్తోందా… ఆ స్టార్ హీరోకు జోడీగానా…!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ గురించి ఈ తరం సినిమా ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 20 సంవత్సరాల క్రితం లయ అంటే అచ్చ తెలుగు హీరోయిన్. సాంప్రదాయమైన వస్త్రధారణతో.. సంప్రదాయమైన క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్ష‌కుల మనసులను ల‌య గెలుచుకుంది సౌందర్య తర్వాత పచ్చ తెలుగు సాంప్రదాయ పద్ధతులతో హీరోయిన్గా చాలా కాలం పాటు కొనసాగింది. తెలుగులో సక్సెస్ఫుల్ కెరియర్‌ కొనసాగించిన తెలుగమ్మాయిలలో లయ పేరు చివర్లో ఉంటుంది. ల‌య‌ తరువాత ఆ రేంజ్ లో తెలుగు హీరోయిన్లు ఎంతమంది వచ్చినా ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు.

అంజలి లాంటి వాళ్లు నటనకంటే గ్లామర్ షోని ఎక్కువగా నమ్ముకున్నారు. కానీ ల‌య‌ మాత్రం గ్లామర్ షో కంటే నటనతో పాటు మంచి క్యారెక్టర్లకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చింది. ప్రేమించు సినిమాలో అంధురాలిగా ఆమె చేసిన నటన నవ్వుతో న భవిష్యత్తు అని చెప్పాలి. ఆమె కెరియర్ మంచి స్పీడ్ గా ఉన్న సమయంలోనే ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. లయ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. స్వతహాగా విజయవాడ నలంద కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమె కూచిపూడి డాన్సర్ గా మంచి పాపులర్.

భద్రం కొడకో అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ల‌య‌కు వేణు హీరోగా వచ్చిన స్వయవరం సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. బాలయ్య లాంటి స్టార్‌ పక్కన విజయేంద్ర వర్మ సినిమాలో కూడా నటించింది. ప్రేమించు సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది. భూమిక మిస్సమ్మ సినిమాలో లయ మధ్య తరగతి గృహిణిగా చేసిన పాత్ర ఇప్పటికీ అలాగే ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది.

తెలుగుతో పాటు తమిళం మలయాళం సినిమాలలోను లయ హీరోయిన్గా సక్సెస్ అయింది. కెరియర్ చివరలో అయితే మలయాళంలో ముమ్ముట్టి – మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా నటించింది. లయ చివరగా తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా లయ కూతురు నటించిన కుమార్తె పేరు శ్లోక.

ఇప్పుడు శ్లోక పెద్ద‌ది అయిపోయింది. ఆమె అచ్చు ల‌య‌లా ఉండ‌డంతో పాటు ఓ స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ల‌క్ష‌ణాలు అన్నీ ఆమెలో ఉన్నాయి. తాజాగా ల‌య‌, ఆమె ప‌క్క‌న కుమార్తె శ్లోక ఇద్ద‌రూ క‌లిసి రెడ్ డ్రెస్సులో ఉన్నారు. అస‌లు చూస్తుంటే వీరిద్ద‌రు త‌ళ్లీ కూతుళ్లు కాదు.. స్నేహితులో లేదా అక్కాచెళ్లెల్లో అన్న‌ట్టుగా ఉంది. ఇక ల‌య కూతురు కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ లేదా మ‌హేష్‌బాబుకు జోడీగా న‌టిస్తే సూప‌ర్‌గా ఉంటుంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ల‌య కూతురును సినిమాల్లోకి తీసుకు వ‌స్తుందో ? లేదో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news