Moviesజ‌స్ట్ అక్కినేని చేయి త‌గిలినందుకు భానుమతి ఎంత ప‌ని చేసిందంటే…!

జ‌స్ట్ అక్కినేని చేయి త‌గిలినందుకు భానుమతి ఎంత ప‌ని చేసిందంటే…!

భానుమ‌తి అన‌గానే.. ఫైర్‌! ఆమె న‌ట‌న‌.. మాట‌.. న‌డ‌క అంతా కూడా ఫైర్ బ్రాండ్‌గానే ఉంటుంది. హీరోను ట‌చ్ చేసే సీన్ అంటే.. కంప‌రం.. త‌న‌కు ఎవ‌రైనా గాత్రం దానం చేస్తామంటే చిరాకు! న‌ట‌న ఆహార్యం.. ఆహారం.. అంతా కూడా స్పెష‌ల్‌. అన్న‌గారు.. ఎన్టీఆర్‌.. అక్కినేని వంటి వారు కూడా.. చాలా వ‌ద్దిక‌గా.. భానుమ‌తితో న‌టించేవారు. విప్ర‌నారాయ‌ణ సినిమాలో భానుమ‌తితో ప్రేమ‌లో ప‌డే సీన్ ద‌గ్గ‌ర‌.. డైరెక్ట‌ర్ ఎన్నో జాగ్ర‌త్త‌లు చెప్పారు.

కానీ, అక్కినేని చేయి షూటింగ్‌లో భాగంగా భానుమ‌తికి త‌గిలేస‌రికి.. పెద్ద‌ర‌గ‌డే అయింద‌ని చెప్పుకొనేవారు. అయితే.. త‌ర్వాత అది స‌ర్దుకుంది లేండి. అయితే.. అప్ప‌టి నుంచి అక్కినేనికి.. భానుమ‌తికి మ‌ధ్య వైరం అలానే కొన‌సాగింది. చివ‌ర‌కు సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు సినిమాలో భానుమ‌తికి అవ‌కాశం ఇవ్వాల‌నుకుని కూడా వెన‌క్కి త‌గ్గారు.

దీనికి కార‌ణం.. అక్కినేనే. ముందుగా… భానుమ‌తినే అనుకున్నార‌ట‌. కానీ, అక్కినేని స‌ల‌హాతో క‌న్న‌డ‌కు చెందిన రోహిణి హ‌ట్టంగ‌డిని తీసుకువ‌చ్చారు. వ‌ర్మ తీసిన రాత్రి హ‌ర్ర‌ర్‌సినిమాలో కూడా రోహిణి హ‌ట్టంగ‌డి అంద‌రినీ ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆమెను తీసుకువ‌చ్చి.. అక్కినేని స‌ర‌స‌న న‌టింప‌జేశారు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యింది.

ఇదే విష‌యం ఆనోటా ఈనోటా.. భానుమ‌తికి తెలిసింది. అయితే.. ఆమె బింకంగా.. ఆ సినిమాలో ప‌స‌లేదు. ఇచ్చినా నేను చేసేదానిని కాదు.. అని చెప్పుకొచ్చార‌ట‌. మొత్తంగా చూస్తే.. సినిమాల్లో.. ఏర్ప‌డిన వివాదాలు.. జీవితంలోనూ కొన‌సాగించిన ఒక‌రిద్ద‌రిలో భానుమ‌తి ముందున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news