MoviesVani Jayaram వాణి జయరాం చనిపోవడానికి కారణం అదే.. సంచలన విషయాని...

Vani Jayaram వాణి జయరాం చనిపోవడానికి కారణం అదే.. సంచలన విషయాని బయటపెట్టిన పోలీసులు..!!

సూపర్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న Vani Jayaram వాణీ జయరాం.. రెండు రోజుల క్రితమే మరణించిన విషయం తెలిసిందే. కాగా తన అద్భుతమైన గాత్రంతో దాదాపు 14 భాషల్లో పదివేలకు పైగా పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వాణి జయరాం.. తన ఇంట్లో అనుమానస్పద స్థితిలో పడి మృతి చెందడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కాగా దీనిపై విచారణ చేసిన పోలీసులు ఎట్టకేలకు వాణి జయరాం మరణించడానికి గల కారణాలను కనిపెట్టారు.

రీసెంట్గా ఫారెన్సిక్ రిపోర్ట్ రావడంతో వాణీ జయరాం మరణానికి గల కారణాలు ఇదే అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు పోలీసులు. ఆమె పొరపాటున కాలుజారి కింద పడడంతో పక్కనే ఉన్న బెడ్ తగిలి తలకు బలమైన గాయం కావడం వల్ల ..బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల..సృహ తప్పి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో .. ఆ విషయాన్ని గమనించకపోవడంతో.. ఆమె మరణించినట్లు పోలీసులు ఫారెన్సిక్ రిపోర్టులో ఉన్న విషయాన్ని తెలియజేశారు .

ఈ క్రమంలోనే ఎవరో వాణి జయరాం ఆస్తి కోసం తనని హత్య చేశారు అన్న వార్తలకు చెక్ పెట్టారు . కాగా వాణి జయరాం చనిపోయే కొన్ని గంటల ముందు ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని పనిమనిషి చెప్పారు . దానికి కారణం కూడా ఆమె కింద పడిపోయి స్పృహ లేకుండా ఉండడమే అంటూ పోలీసుల క్లారిటీ ఇచ్చారు . ఈ క్రమంలోని వాణి జయరాం అభిమానులు మరోసారి ఆమెను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే వాణి జయరాం లాంటి సింగర్ ఇకపై ఇండస్ట్రీలో రారు .. రాబోరు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news