Moviesసినిమా లు అంటే ఇష్టం లేని కే. విశ్వనాథ్.. స్టార్ డైరెక్టర్...

సినిమా లు అంటే ఇష్టం లేని కే. విశ్వనాథ్.. స్టార్ డైరెక్టర్ గా మారడానికి కారణం ఎవరో తెలుసా..?

మన లైఫ్ లో అన్నీ మనం అనుకున్నట్లే జరగవు .. కొన్నిసార్లు మనం ఊహించినవి మనకు మంచి చేసి పెడుతూ ఉంటాయి . అలా లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ కెరియర్లో జరిగిన కారణంగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఇలాంటి స్థానాన్ని సంపాదించుకోగలిగారు. మనకు తెలిసిందే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కే విశ్వనాథ్ ఎలాంటి సినిమాలను సినిమా ఇండస్ట్రీకి అందించారో.

ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన ప్రతి సినిమా ఆణిముత్యం అనే చెప్పాలి . తీసిన కథను మళ్ళీ తీయ్యకుండా .. సరికొత్త కథతో జనాల మనసుకు దగ్గరైన కళాతపస్వి కే విశ్వనాథ్ కొద్ది గంటల క్రితమే మరణించారు . అనారోగ్య కారణంగా బాధపడుతున్న కే విశ్వనాథ్ గురువారం మరణించారు . ఈ క్రమంలోనే ఆయన లైఫ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .కాగా నిజానికి కళాతపస్వీ కే విశ్వనాథ్ కి సినిమాలు అస్సలు ఇష్టం ఉండేది కాదట . ఆయనకు సినిమా అంటే ఒక మెసేజ్ ఒక ఆహ్లాదకరమైనది గా ఉండాలి అని అనుకునే వారట .

కానీ అప్పట్లో వచ్చే సినిమాలు ఆయనకు పెద్దగా నచ్చేవి కాదట. ఈ క్రమంలోనే ఆయన మెల్లగా తన ఆలోచనలను ఇష్టం లేకుండానే సినిమా ఇండస్ట్రీ పై పెట్టేవారట . ఈ క్రమంలోని వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ విభాగంలో పని చేస్తూ తన కెరియర్ని స్టార్ట్ చేసిన కే విశ్వనాథ్ ..ఇక అలా అలా సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఏర్పడి బి.ఎన్.రెడ్డి , కె.వి.రెడ్డి , ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ళ పనితీరును దగ్గరుండి పరిశీలిస్తూ పెరిగాడు. ఈ క్రమంలోనే వాళ్లకు కే విశ్వనాథ స్క్రిప్ట్ లో తోచిన సలహాలు ఇస్తూ ఉండేవారట .

అలా కే విశ్వనాధ్ లోని మంచి టాలెంట్ చూసి ఆదుర్తి తన సినిమాలకు స్క్రిప్ట్ , అసిస్టెంట్గా అసోసియేట్ గా పనిచేసే అవకాశం కల్పించారట . అయితే ఇష్టం లేకుండానే అలా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కే విశ్వనాథ్ కి తన కెరియర్ ని మలుపు తిప్పింది మాత్రం అన్నపూర్ణ అన్నపూర్ణ పిక్చర్స్ అనే చెప్పాలి . ఆయన ను వాహినీ వదిలేసి, తమ అన్నపూర్ణా పిక్చర్స్‌ సంస్థలోకి, పూర్తిగా దర్శకత్వశాఖలోకి రమ్మని ప్రోత్సహించింది హీరో అక్కినేని నాగేశ్వరరావే అని విశ్వనాథ్‌ పలు ఇంటర్వ్యూలో తెలిపారు. స్వతహాగా క్రియేట్ పర్సన్ అయిన విశ్వనాథ్ ని.. ఆదుర్తి వజ్రంలా తీర్చిదిద్దారు .

ఈ క్రమంలోనే “వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి”.. లాంటి హిట్ సినిమాలకు ఆయన వద్ద అసిస్టెంట్గా వర్క్ చేశారు విశ్వనాథ్ . ఈ టైం లోనే అక్కినేని నాగేశ్వరరావు ఆయన డైరెక్షన్ మెచ్చి ఆత్మగౌరవం సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు . ఈ సినిమాతోనే ఆయన ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ చేశాడు. ఇలా ఆత్మగౌరవంతో స్టార్ట్ అయిన ఆయన కెరియర్ బ్రేక్స్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయింది. కేవలం డైరెక్టర్ గానే కాదు నటుడుగా కూడా సినీ పరిశ్రమలో నటించి మెప్పించారు కె విశ్వనాథ్ . ఇలా మల్టీ టాలెంట్ అంటూ పేరు సంపాదించుకున్న కే విశ్వనాథ్.. మొత్తంగా 53 సినిమాలకు డైరెక్షన్ వహించారు . పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయం సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించేలా చేయడమే తన లక్ష్యం అంటూ కళాతపస్వి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news