Movies"వాళ్లే కాదు..నా బిడ్డ కూడా".. ఫస్ట్ టైం ఆ విషయాని...

“వాళ్లే కాదు..నా బిడ్డ కూడా”.. ఫస్ట్ టైం ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన ఉపాసన..!!

మనకు తెలిసింది మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుంది. గత పెదేళ్లుగా మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన మూమెంట్.. ఎట్టకేలకు రివీల్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన టైం నుంచి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాటిని ఏమాత్రం సీరియస్ గా తీసుకొని మెగా ఫ్యామిలీ తమ వారసుడు వస్తున్న మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు .

 

ఈ క్రమంలోనే ఉపాసన కొణిదెల ఫస్ట్ టైం తన ప్రెగ్నెన్సీ పై సోషల్ మీడియాలో స్పందించింది . మనకు తెలిసిందే ఉపాసన భర్త రామ్ చరణ్ లాస్ట్ గా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం అందుకునిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు వచ్చింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ వేడుక కోసం ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో కలిసి ఆ వేడుకలో పాల్గొనింది.

ఆర్ఆర్ఆర్ మూవీ ఆ అవార్డు గెలుచుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది ఉపాసన. ” ఆరారార్ ఇంతటి విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది . నేను కూడా ఇందులో భాగమైనందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది . దేశం గర్వించి తగ్గ సినిమా ఇది అని నేను నమ్ముతున్నాను .

ఈ ప్రయాణంలో నేను ఓ పార్టనర్ గా మారినందుకు చాలా చాలా హ్యాపీ.. రాజమౌళికి ప్రత్యేకంగా థాంక్స్ . అంతేకాదు ఈ వేడుకలో నాతోపాటు నా బిడ్డ కూడా ఈ ఎంజాయ్మెంట్ ను ఫీలవుతుంది ..కొత్త అనుభూతిని పొందుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది” అంటూ చెప్పికొచ్చింది. దీంతో ఉపసాన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news