Moviesచిరంజీవి తన జీవితంలో ఎక్కువ ఉపయోగించిన పదం ఇదే.. అందుకే మెగాస్టార్...

చిరంజీవి తన జీవితంలో ఎక్కువ ఉపయోగించిన పదం ఇదే.. అందుకే మెగాస్టార్ అయ్యాడు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎటువంటి హెల్ప్ , సపోర్ట్ లేకుండా.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే కాకుండా .. హీరోగా తర్వాత స్టార్ హీరోగా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రినే ఏలేస్తే మెగాస్టార్ గా రాజ్యమేలుతున్నాడు . దానికి మెయిన్ రీజన్ సినిమాల పై ఆయనకు ఉన్న్ ఇంట్రెస్ట్ నే అని చెప్పక తప్పదు .

కాగా రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డ అనే షోకు అటెండ్ అయ్యారు . ఫస్ట్ టైం ఇలాంటి టాక్ షో కి అటెండ్ అయిన చిరంజీవి ..తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చి షోకి హ్యూజ్ టిఆర్పి రేటింగ్ సంపాదించి పెట్టారు. కాగా ఇదే క్రమంలో డైరెక్టర్ బాబి , వెన్నెల కిషోర్ కూడా ఈ షోకి అటెండ్ అయ్యారు.

ఇదే షోలో టాస్క్ లో భాగంగా యాంకర్ సుమ కనకాల – చిరంజీవికి సంబంధించిన పలు ప్రశ్నలను డైరెక్టర్ బాబిని అడిగింది . ఇదే క్రమంలో డైరెక్టర్ బాబి మెగాస్టార్ కి సంబంధించిన విషయాలను టపా టపా అంటూ చెప్పి ఆయన రియల్ ఫ్యాన్ అంటూ నిరూపించుకున్నాడు . అదే కాదు టాస్క్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ..” చిరంజీవి నోటి నుండి ఇప్పటివరకు ఎక్కువ వినిపించిన పదం తమ్ముళ్లు “అంటూ చెప్పుకొచ్చారు .ఆయన్ని ఒక్క వర్డ్ లో వర్ణించాలి అంటే ఏం చెప్తారు అని సుమ అడిగింది..బాబీ తడుముకోకుండా ” ఎవరెస్టు ” అంటూ ఆన్సర్ ఇచ్చాడు . దీంతో మెగా ఫాన్స్ ఆ వీడియో క్లిప్స్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news