Moviesకృష్ణ - విజ‌య‌నిర్మ‌ల‌పై అప్ప‌ట్లో ఇన్ని పుకార్లు న‌డిచాయా.. అస‌లేం జ‌రిగింది...!

కృష్ణ – విజ‌య‌నిర్మ‌ల‌పై అప్ప‌ట్లో ఇన్ని పుకార్లు న‌డిచాయా.. అస‌లేం జ‌రిగింది…!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విభిన్న‌మైన పాత్ర‌ల ద్వారా త‌న న‌ట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించిన సూప‌ర్ స్టార్ కృష్ణ‌.. కేవ‌లం న‌ట‌న ప‌రంగానే కాకుండా… ఇండ‌స్ట్రీలో అనేక అద్భుతాలు చేసిన ప్ర‌యోగశిల్పిగా కూడా పేరు తెచ్చుకున్నారు. సినిమా స్కోప్ నుంచి క‌ల‌ర్ వ‌ర‌కు.. అనేక ప్ర‌యోగాలు చేశారు. ఇక‌, ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌నిర్మ‌ల కూడా.. కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాలేదు. ద‌ర్శ‌కురాలిగా.. నిర్మాత‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

ఇదిలావుంటే, కృష్ణ‌-విజ‌య‌నిర్మ‌ల జంట‌.. ఎప్పుడూ హాట్ ఫేవ‌రెట్ అనే టాక్ వినిపించేది. వారిద్ద‌రూ.. ఎప్పు డూ క‌లిసే క‌నిపించేవారు. విదేశాలు వెళ్లినా, ఏదైనా ఔట్ డోర్ షూటింగుల‌కు వెళ్లినా కూడా క‌లిసే ఉండేవా రు. లేదా.. మిత్రులు ఏదైనా కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానించినా కూడా ఇద్ద‌రూ కలిసి హాజ‌ర‌య్యేవారు. దాదాపు కృష్ణ ఎక్క‌డుంటే అక్కడ విజ‌య‌నిర్మ‌ల క‌నిపించిన సంద‌ర్భాలు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో అనేక ప్ర‌శ్న‌లు వారి చుట్టూ తిరిగేవి. ముఖ్యంగా ఇద్ద‌రి సామాజిక వ‌ర్గాల‌పై పెద్ద ఎత్తున చర్చ జ‌రిగేది. అదే స‌మ‌యంలో వివాహాల గురించిన ఆరాలు కూడా ఎక్కువ‌గా సాగేవి. అయితే.. ఈ విష‌యాల్లో ఇద్దరూ ఎక్క‌డా భిడియ ప‌డేవారు కాదు. త‌మ‌ను ఎవ‌రైనా.. ఏదైనా అడిగితే.. వెంట‌నే రియాక్ట్ అయ్యేవారు. త‌డుము కోకుండానే స‌మాధానం చెప్పేవారు. విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌కుండా ఉండేవారు.

అదేవిధంగా ఆర్థిక విష‌యాల‌కు వ‌చ్చేస‌రికి కూడా అలానే ఉండేవారు. మెజారిటీ ఆర్థిక నిర్వ‌హ‌ణ అంతా కూడా విజ‌య‌నిర్మ‌ల చూసుకునేవార‌ని.. పెట్టుబ‌డులు, ఆదాయం కూడా ఆమె క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచేద‌ని.. ఇటీవ‌ల కృష్ణ సోద‌రుడు తెలిపారు. ఈ క్ర‌మంలో ఒక్కొక్క సారి న‌ష్టాలు వ‌చ్చినా.. వాటిని వేరే రూపంలో క‌వ‌ర్ చేసేవార‌ని చెప్పారు. దానాలు ధ‌ర్మాలు కూడా ఇద్ద‌రూ క‌లిసే చేసేవార‌ని తెలిపారు. ఇదీ.. కృష్ణ-విజ‌య‌నిర్మ‌ల‌ను నిరంత‌రం హాట్ టాపిక్‌గా ఉంచేలా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news