Moviesనువ్వు నేను హీరోయిన్ అనిత అంత త్వరగా లావెక్కడానికి కారణం వాళ్లేనా..?

నువ్వు నేను హీరోయిన్ అనిత అంత త్వరగా లావెక్కడానికి కారణం వాళ్లేనా..?

తేజ అంటే మంచి గ్లామర్ హీరోయిన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారనే పేరుంది. అంతేకాదు..ఇప్పటి వరకు ఆయన పరిచయం చేసిన వారు చాలామంది స్టార్ హీరోయిన్స్‌గా కొంతకాలం ఓ వెలుగు వెలిగిన వారే. వారిలో ముఖ్యంగా చందమామ కాజల్ అగర్వాల్ ఏ స్థాయిలో నిలిచిందో అందరికీ తెలిసిందే. చిత్రం సినిమాతో రీమాసేన్, నువ్వు నేను సినిమాతో అనిత, జయం సినిమాతో సదా, లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్.

ఇలా ఇండస్ట్రీకి ఆయన పరిచయం చేసిన హీరోయిన్స్ మంచి స్థాయిలో నిలిచారు. తేజ సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులు ఖచ్చితంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. సాధారణంగా మన తెలుగు సినిమా కొన్ని లెక్కల ప్రకారం నిర్మించబడుతుంది. వాటన్నిటికీ పూర్తి భిన్నంగా తేజ సినిమా నిర్మాణాన్ని పరిచయం చేశారు. కేవలం 40 లక్షల లోపే ఓ కమర్షియల్ సినిమాను నిర్మించి దానికి 10 రెట్లు లాభాలను పొందవచ్చుననే లాజిక్ తేజ పరిచయం చేసిందే.

 

ఆయ‌న తొలి సినిమా చిత్రం కేవ‌లం రు. 38 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి ఆ రోజుల్లోనే రు 6.5 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. ఈ క్రమంలోనే ఆయన నుంచి వ‌చ్చిన‌ నువ్వు నేను అనే సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నమోదు చేసిన రికార్డుల గురించి కొన్నేళ్ళు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఈ సినిమాతో పరిచయమైన అనిత అప్పట్లో హాట్ టాపిక్.

అయితే మొదటి సినిమాలో అనిత చాలా నాజూకుగా ఉండింది. ఈ సినిమాలో ఉన్న అందం కూడా ఆ తర్వాత లేదని చెప్పాలి. దీనికి కారణం తర్వాత సినిమాలకి బాగా లావవడమే. శ్రీరాం సినిమాలో చూస్తే అనిత ఎంత బొద్దుగా కనిపిస్తుందో తెలుస్తుంది. అయితే, అమ్మడు బాగా నైట్ పార్టీలు..జంక్ ఫుడ్ తినడం వల్ల …రెస్ట్ లేకుండా మేకర్స్ వాడటం వల్ల ఇలా బొద్దుగా తయారైందనే కామెంట్స్ వినిపించాయి. ఇక హీరోయిన్‌గా గుర్తింపు వచ్చాక ఎన్ని కమిట్‌మెంట్స్ ఉంటాయో తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news