Movies"పగలు సినిమాలు..రాత్రులు బంచిక్ బం"..ఛీ ఛీ సిగ్గులేదారా..స్టార్ హీరో గా ఉండి...

“పగలు సినిమాలు..రాత్రులు బంచిక్ బం”..ఛీ ఛీ సిగ్గులేదారా..స్టార్ హీరో గా ఉండి ఇలాంటి పనులా..?

తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొన్నిసార్లు పాపులారిటీ ఉన్న హీరోలు కూడా తప్పుటడుగులు వేసి సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు . అంతేనా ఇంకా హద్దులు మీరి తమకున్న పాపులారిటీ దృష్ట్యా ఆ పేరుని వేరే చెడ్డ పనులకు ఉపయోగించుకొని తమ పరువుని తామే తీసుకుంటూ ఉంటారు. అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు ప్రముఖ కన్నడ హీరో మంజునాథ్ అలియాస్ సంజు .

ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంజు..గతేఅడాది.. రిలీజ్ అయిన న్యూరాన్ అనే సినిమాలో కూడా నటించి మంచి నటుడుగా గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ఏం లాభం పార్ట్ టైం సినిమాలకు ఫుల్ టైం వ్యభిచారానికి టైం స్పెండ్ చేస్తూ తన పేరుని తాను నాశనం చేసుకున్నాడు కన్నడ స్టార్ హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న సంజు.

బాంగ్లాదేశ్ నుండి అక్రమంగా అమ్మాయిలను బెంగళూరుకి రప్పించి.. బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు .పక్క సమాచారం అందుకున్న పోలీసులు అతగాడిని పకడ్బందీగా అరెస్ట్ చేశారు . తానే తెలివితేటలు ఉన్న హీరోగా భావించే సంజు పోలీసులు వేసిన పక్క స్కెచ్ లో పట్టూబడిపోయాడు. కాగా ప్రజెంట్ పోలీస్ కస్టడీలో ఉన్న కన్నడ హీరో మంజునాధ్..అలియాస్ సంజు.. నీ కన్నడ పరిశ్రమ బ్యాన్ చేసే విధంగా ఆలోచిస్తుంది .

బెంగళూరు నగరంలోని కెంగేరి డెంటల్ కాలేజీ సమీపంలో ఒక అద్దె ఇంటిలో ఈ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రెక్కీ నిర్వహించారు. నిన్న తెల్లవారుజామున 4 నుంచి 5.30 గంటల మధ్య సీసీబీ పోలీసులు దాడులు నిర్వహించి కెంగేరిలోని వినాయకనగర్, బాదరహళ్లి ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news