Moviesఆ హీరోల‌కు హీరోయిన్ల‌తో రొమాన్స్ అంటే ద‌డ‌... త‌మ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఆ హీరోల‌కు హీరోయిన్ల‌తో రొమాన్స్ అంటే ద‌డ‌… త‌మ‌న్నా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ వ‌య‌స్సులోనూ టాలీవుడ్‌లో కెరీర్ కొన‌సాగిస్తూ వ‌స్తూ ఉండ‌డం గొప్ప విష‌యం. త‌మ‌న్నా వ‌య‌స్సు ఇప్ప‌టికే మూడున్న‌ర ప‌దుల‌కు చేరువ అయ్యింది. అటు చిరంజీవి లాంటి సీనియ‌ర్ హీరోల‌కు జోడీ క‌డుతూనే ఇటు యంగ్ హీరోల‌తో గుర్తుందా శీతాకాలం లాంటి సినిమాల్లోనూ రొమాన్స్ చేస్తోంది. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో మ‌రో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంకటేష్‌కు జోడీగా న‌టించింది.

చిరంజీవికి జోడీగా సైరా సినిమాలో న‌టించిన ఈ పాల బుగ్గ‌ల సుంద‌రి ఇప్పుడు భోళా శంక‌ర్ సినిమాలోనూ న‌టిస్తోంది. ఏదేమైనా త‌మ‌న్నా ఇప్పుడు టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోల‌కు బెస్ట్ ఆప్ష‌న్‌గా ఉంది. బాల‌య్య‌, నాగార్జున లాంటి వాళ్ల ప‌క్క‌న కూడా ఆమె న‌టించే ఛాన్సులు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువుగా గ్లామ‌ర్ ఒల‌క‌బోసే పాత్ర‌ల్లోనే న‌టించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు కాస్త పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లే చేస్తూ వ‌స్తోంది.

త‌మ‌న్నా ఇప్పుడు అందం ఆర‌బోసిందంటే చాలు సినిమా సూప‌ర్ హిట్టే అవుతోంది. బాలీవుడ్‌లో ఆమె అందాలు ఒల‌క‌బోసిన ప‌లు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఎన్నో ఐటెం సాంగుల్లో త‌మ‌న్నా ఒళ్లంతా ఊపేస్తూ ఇర‌గ‌దీస్తోంది. ఇక హీరోల‌తో రొమాన్స్ సీన్ల‌లో న‌టించే విష‌యంపై త‌మ‌న్నా స్పందించింది. హీరో, హీరోయిన్లు చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యే సీన్ల‌లో న‌టించేట‌ప్పుడు హీరోయిన్ల కంటే.. హీరోల‌కే ఎక్కువుగా వ‌ణుకు పుడుతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

Viral: 5 Hottest Bold Song Videos Of Tamannaah Bhatia That Will Make You  Sweat | IWMBuzz

తాను అలా రొమాన్స్ చేసిన హీరోల్లో చాలా మంది షేక్ అవ్వ‌డం గ‌మ‌నించాన‌ని.. అయితే అమ్మాయిల‌తో తాము నిజంగానే అలా చేస్తున్నామ‌న్న ఫీలింగ్‌తోనే వారు వ‌ణుకుతూ ఉండ‌వ‌చ్చ‌ని కూడా త‌మ‌న్నా చెప్పింది. ఇక త‌మ‌న్నా ప్ర‌స్తుతం త‌న భాయ్‌ఫ్రెండ్ విజ‌య్‌వ‌ర్మ‌తో షికార్లు కొడుతోంది. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి చేసుకుంటార‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news