Moviesతమిళ తంబీలు అలా..తెలుగు జనాలు ఇలా..హీట్ పెంచేసిన సందీప్ కిషన్ మాటలు..!!

తమిళ తంబీలు అలా..తెలుగు జనాలు ఇలా..హీట్ పెంచేసిన సందీప్ కిషన్ మాటలు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగులో తనదైనా స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సందీప్ కిషన్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ హీరో గానే సినిమాలు చేస్తాను అంటూ భీష్ముంచుకుని కూర్చున్న సందీప్ కిషన్ .. కంటెంట్ ఉంటేనే సినిమాలకు యాక్సెప్ట్ చేస్తాడు .

మరీ ముఖ్యంగా సందీప్ కిషన్ ఎప్పటినుంచో పాన్ ఇండియా లెవెల్లో సినిమాను తీయాలని ఆశపడుతున్నాడు. కాగా ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి సందీప్ కిషన్ మైకేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన్ పాటలు, లుక్స్ జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ..”పాన్ ఇండియా సినిమా ను కూడా వివిధ భాషల్లో స్ట్రైట్ మూవీ అని చెప్పిన కొన్ని భేదాలు చూపిస్తూ ఉంటారు ..తమిళంలో అయితే ఇంకా డబ్బింగ్ అనే ముద్ర మారలేదు . కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఆ విషయంలో గ్రేట్ ..పెద్దగా అనుమానాలు వ్యక్తం చేయరు . ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా సినిమాలు చూస్తారు .”

“ఎంతోమంది ఎన్నోసార్లు ట్రై చేసినా ఈ డిఫరెన్స్ అనేది ఎందుకో మారలేకపోతుంది అంటూ సందీప్ కిషన్ తెలిపాడు . ఈ క్రమంలోనే సందీప్ కిషన్ మాట్లాడిన మాటలు జనాలకు హార్టింగ్ గా అనిపిస్తున్నాయి. దీంతో ఆయన పేరును సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు . కాగా మైకేల్ సినిమాను మాత్రం తప్పకుండా జనాలు ఆదరిస్తారు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు సందీప్ కిషన్ . మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే ఫిబ్రవరి 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news