Moviesఓ మై గాడ్: రవితేజ అంత రిచ్ హీరోనా.. ఆయన ఉంటున్న...

ఓ మై గాడ్: రవితేజ అంత రిచ్ హీరోనా.. ఆయన ఉంటున్న ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా..!

టాలీవుడ్ మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న మాస్ మహారాజ రవితేజ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ .. ఆ తర్వాత నటించిన వాల్తేరు వీరయ్య తో కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకున్నాడు.

కాగా రీసెంట్గా నటుడు కమల్ రవితేజ పైచేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ..” నేను సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో హీరోగా మారాను . అప్పటికి రవితేజ ఇంకా హీరో అవ్వలేదు . ఇప్పుడెంత ఎనర్జిటిక్ గా ఉండేవాడో. అప్పుడు అంతకు డబల్ రేంజ్ లో ఉండేవాడు . కాకపోతే కొద్దిగా లావుగా ఉండేవాడు . అంతే కానీ రవితేజ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు . ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోలకే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు .

మాస్ మహారాజ రవితేజలో ఎవరికి తెలియని విషయమేమిటంటే ఆయన ఆరోగ్యం బాగాలేక పోయిన జిమ్ చేస్తూ ఉంటాడు . కాగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హైదరాబాద్లో ఒక ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు అనుకునేవాడు . ఇక తర్వాత ఏది వచ్చిన అంత బోనస్సే ..ఆ దేవుడు ఇచ్చిన వరమే అనుకునేవాడు . కాగా అలాంటి రవితేజ ఈ రోజు 12 కోట్లు ఖరీదు చేసే ఇంట్లో ఉంటున్నాడు ” అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు . ఈ క్రమంలోనే రవితేజ ఉంటున్న ఇల్లు ఖరీదు 12 కోట్లు అంటూ లీక్ అయింది. దీంతో సోషల్ మీడియాలో రవితేజ పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news