Moviesసినీ ఇండస్ట్రీలో మరో విడాకులు..పెళ్ళైన 23 ఏళ్ళ తరువాత భార్య కి...

సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు..పెళ్ళైన 23 ఏళ్ళ తరువాత భార్య కి డివర్స్ ఇవ్వబోతున్న విజయ్..!?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో “విడాకులు” అన్న పదం ఎంత ఎక్కువగా వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. ఒక మాట అరిస్తే విడాకులు.. మరో మాట మాట్లాడకపోతే విడాకులు ..మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోతే విడాకులు ..అడిగింది కొనివ్వకపోతే విడాకులు ..ఇలా ప్రతి చిన్న విషయానికి విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువైపోయాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా ఇలా ప్రతి చిన్న విషయానికి విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఈ మధ్యకాలంలో విడాకులు అన్న పదం కామన్ గా వినిపిస్తుంది .

ఇదే మూమెంట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దళపతి కూడా విడాకులు తీసుకోబోతున్నారు అన్న న్యూస్ గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రెసెంట్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా మరికొద్ది రోజుల్లోనే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి టైంలో విజయ్ దళపతి పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా అభిమానులకు మింగుడు పడడం లేదు. అయితే ఇప్పటివరకు విజయ్ దీనిపై స్పందించకపోవడంతో చాలామంది ఫాన్స్ ఈ వార్తను నిజమే అంటూ నమ్ముతుంటే.. మరికొందరు ఫాన్స్ పుకారు అంటూ కొట్టి పడేస్తున్నారు .

అయితే విజయ్ దళపతి నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియా గట్టిగా నొక్కి చెబుతుంది , దానికి మెయిన్ రీజన్స్ ఈ మధ్యకాలంలో విజయ్ తన భార్యతో బయట కనిపించకపోవడమే కారణం అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న అట్లీ ఈ మధ్యనే తండ్రి కాబోతున్నానంటూ ప్రకటించాడు. కాగా రీసెంట్ గాని తన భార్య సీమంతం వేడుకలు గ్రాండ్గా జరిగాయి . ఈ ఫంక్షన్ కి కోలీవుడ్ లో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు . అయితే ఈ ఫంక్షన్ లో విజయ్ భార్య సంగీత ఎక్కడ కనిపించనేలేదు . అంతేకాదు నిన్నకాక మొన్న చెన్నైలో గ్రాండ్గా జరిగిన వారసుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో సంగీత ఎక్కడ కనిపించనే లేదు . తన సినిమా ఈవెంట్స్ కి భార్యని ఎప్పుడు వెంటపెట్టుకొని వచ్చే విజయ్ ఇలా సింగిల్ గా ఈవెంట్ కి అటెండ్ అవ్వడంతో ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి .

అంతే కాదు పలువురు ఫ్రెండ్స్ కూడా ఈ మధ్యకాలంలో సంగీత ని మీట్ అవలేదు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో విజయ్ సంగీత దూరం దూరంగా ఉంటున్నారని న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది .అయితే సన్నిహిత వర్గాలు మాత్రం ఇవంతా ఫేక్ అంటూ కొట్టు పడేస్తున్నారు . విజయ్ సంగీత చాలా హ్యాపీగా ఉన్నారని.. పెళ్లయిన 23 ఏళ్ల తర్వాత వాళ్ళ దాంపత్య జీవితంపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని చెప్పుకొస్తున్నారు . అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటివరకు విజయ్ దళపతి తనపై వస్తున్న ఈ విడాకులు రూమర్ పై స్పందించకపోవడం గమనార్హం. నిజంగానే పెళ్లయిన 23 ఏళ్ల తర్వాత భార్యకు డివర్స్ ఇచ్చే అంత కష్టం ఏమొచ్చింది విజయ్ కి అంటూ కొందరు నెటిజన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ విడాకుల వార్తకు చెక్ పెట్టాలంటే విజయ్ దళపతి నోరు విప్పి అసలు నిజం బయట పెట్టాల్సిందే అంటూ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం మరి విజయ్ దళపతి ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news