Moviesఈ టాలీవుడ్ హీరోల కెరీర్ డేంజ‌ర్లో ప‌డిందా... అదొక్క‌టి లేక‌పోతే పాతాళంలోకే...!

ఈ టాలీవుడ్ హీరోల కెరీర్ డేంజ‌ర్లో ప‌డిందా… అదొక్క‌టి లేక‌పోతే పాతాళంలోకే…!

సినిమా రంగంలో ప్ర‌తి శుక్ర‌వారం నెంబ‌ర్లు మారిపోతూ ఉంటాయి. అందుకే శుక్ర‌వారం వ‌స్తోందంటే చాలు హీరోలు టెన్ష‌న్ ప‌డిపోతూ ఉంటారు. ప్ర‌స్తుతం హిట్ కొట్టిన వాడే ఇక్క‌డ టాప్ ర్యాంకులో ఉన్న‌ట్టు. గ‌తంలో ఎంత గొప్ప హీరో అయినా.. ఎన్ని హిట్లు ప‌డినా.. ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నాడంటే అత‌డి ర్యాంక్‌, మార్కెట్ డౌన్‌లో ఉన్న‌ట్టే..! ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో గ‌తేడాది ప్లాపులు కొట్టిన హీరోలు అంద‌రూ ఈ యేడాది కోసం కోటి ఆశ‌ల‌తో ఎదురు చూస్తూ టెన్ష‌న్ ప‌డుతున్నారు.

ఈ యేడాది కూడా వారు కోరుకున్న హిట్ ద‌క్క‌క‌పోతే వారి కెరీర్ డేంజ‌ర్ జోన్‌లోకి వెళ్లిపోయిన‌ట్టే..! మ‌రి ఈ యేడాది త‌ప్ప‌కుండా హిట్ కొట్టాల్సిన ఆ హీరోలు ఎవ‌రో ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. ఈ యేడాది హిట్ ప‌డ‌క‌పోతే ముందే డేంజ‌ర్ జోన్లో ప‌డిపోయే హీరోల్లో ముందు వ‌రుస‌లో విజ‌య్ దేవ‌ర‌కొండే ఉంటాడు. లైగ‌ర్‌కు ముందు అన్నీ ప్లాపులే. లైగ‌ర్ ఘోరంగా డిజాస్ట‌ర్ అయ్యి మ‌నోడి ప‌రువు తీసేసింది. ఖుషితో హిట్ కొట్ట‌క‌పోతే విజ‌య్ మార్కెట్ ప‌డిపోయి.. క్రేజ్ కూడా డౌన్ అవుతుంది.

ఈ యేడాది త‌ప్ప‌కుండా హిట్ కొట్టాల్సిన హీరో మెగాస్టార్ చిరంజీవి. గ‌తేడాది ఆచార్య అట్ట‌ర్ ప్లాప్ అయ్యి ప‌రువు తీసేసింది. గాడ్ ఫాద‌ర్ కూడా ప్లాపే. ఈ యేడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌తో వ‌స్తున్నాడు. స‌మ్మ‌ర్‌కు భోళాశంక‌ర్ ఉంది. రెండు సినిమాలు హిట్ కాక‌పోతే చిరు కొన్నేళ్లు కెరీర్ లాగ‌డం క‌ష్ట‌మే. ఇక ప్ర‌భాస్‌ది కూడా అదే ప‌రిస్థితి. బాహుబ‌లి సీరిస్ త‌ర్వాత సాహో ప్లాప్ అయినా ప‌రువు నిల‌బ‌డింది.

అయితే రాధేశ్యామ్ ప్ర‌భాస్ ప‌రువు మొత్తం తీయ‌డంతో పాటు మ‌నోడి మార్కెట్‌ను కూడా బాగా దెబ్బేసింది. ఇది పాన్ ఇండియా లెవ‌ల్లో రావ‌డం కూడా మైన‌స్ అయ్యింది. ఈ యేడాది ప్ర‌భాస్ ఆదిపురుష్‌, లేదా స‌లార్‌లో ఏది ముందు వ‌స్తే అది హిట్ అవ్వ‌క‌పోతే ప్ర‌భాస్ మ‌రింత డౌన్ అవుతాడు. ఇక నేచుర‌ల్ స్టార్ నాని కూడా అదే స్థితిలో ఉన్నాడు. గ‌తేడాది చివ‌ర్లో వ‌చ్చిన శ్యామ్‌సుంద‌రాయ అంచ‌నాలు అందుకోలేదు. ఇక ఈ యేడాది వ‌చ్చిన అంటే సుంద‌రానికి క్లాసిక్ మూవీ అని నాని ఎంత చెప్పుకుంటున్నా అది ప్లాపే.

నాని సినిమాలు ఇటీవ‌ల ఎందుకో మొనాట‌నీ అయిపోతున్నాయి. స‌రైన హిట్ రావ‌డం లేదు. నాని ద‌స‌రాతో హిట్ కొట్ట‌క‌పోతే కెరీర్ ప‌రంగా చాలా వెన‌క్కు వెళ్లిపోతాడు. ఇప్ప‌టికే నానికి యంగ్ హీరోల పోటీతో రేసులో వెన‌క్కు వెళ్లిపోయాడు. ఇక రామ్ కూడా ఈ యేడాది వారియ‌ర్ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఈ యేడాది బోయ‌పాటి సినిమాతో హిట్ కొట్ట‌క‌పోతే రామ్ పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందే..! మ‌రి ఈ యేడాది వీళ్ల‌లో ఎవ‌రు హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌స్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news