Moviesబిగ్ బ్రేకింగ్: తారకరత్న హెల్త్ కండీషన్ క్రిటికల్..చేతులెత్తేసిన డాక్టర్లు..!?

బిగ్ బ్రేకింగ్: తారకరత్న హెల్త్ కండీషన్ క్రిటికల్..చేతులెత్తేసిన డాక్టర్లు..!?

ఇది నిజంగా నందమూరి అభిమానులకు బాడ్ న్యూస్ అనే చెప్పాలి . తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . మనకు తెలిసిందే ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు . నారా లోకేష్ చేపట్టిన యువ గళం పేరిట పాదయాత్ర చేస్తున్న సందర్భంగా తారకరత్న కూడా పాదయాత్రకు హాజరయ్యారు . ఈ క్రమంలోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు . దీంతో వెంటనే హుటాహుటిన కుప్పంలోని సమీప ఆసుపత్రిలో చేర్పించారు .

అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించిన డాక్టర్లు.. నిన్న సాయంత్రం వరకు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు . అయితే సడన్గా అరగంట ముందు డాక్టర్స్ ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అంటూ మెన్షన్ చేయడం ఇప్పుడు నందమూరి అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది . లోకేష్ లక్ష్మీపురం వరదరాజ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు అక్కడ తీర్థప్రసాదాలు తీసుకున్నానంతరం తన పాదయాత్రను ప్రారంభించారు .

లోకేష్ తో పాటి తారకరత్న కూడా పాల్గొన్నారు. అయితే సడన్గా ఆయన పాదయాత్రలో కుప్పకూలిపోవడం ఆయన శరీరం నీలం రంగులోకి మారడంతో ఆయనపై విష ప్రయోగం జరిగింది అంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అయితే ఆయన ఆ జనాభా తాకిడికి ఊపిరి తిప్పుకోలేక స్పృహ తప్పి పడిపోయారని.. ఆ క్రమంలోనే హార్ట్ ఎటాక్ వచ్చిందని డాక్టర్స్ తేల్చేశారు . కాగా ప్రస్తుతం ఆయన కండిషన్ అత్యంత విషమంగా ఉంది అంటూ డాక్టర్స్ చెప్పుకువచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news