Moviesఎవ్వ‌రూ ఊహించ‌ని బ్యాక్‌డ్రాప్‌తో బాల‌య్య సినిమా... ఇది పెను సంచ‌ల‌న‌మే...!

ఎవ్వ‌రూ ఊహించ‌ని బ్యాక్‌డ్రాప్‌తో బాల‌య్య సినిమా… ఇది పెను సంచ‌ల‌న‌మే…!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టాడు. బాల‌య్య కెరీర్‌లో ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ప‌డ‌లేదు. కానీ అఖండ ఇప్పుడు వీర‌సింహారెడ్డి రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. యావ‌రేజ్ కంటెంట్‌, రొటీన్ స్ట‌ఫ్‌తో వ‌చ్చినా బాల‌య్య క్రేజ్‌తో వీర‌సింహారెడ్డి బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిపోయింది. ఇక త్వ‌ర‌లో రాబోతోన్న బాల‌య్య 108వ సినిమాపై కూడా ఇప్పుడు భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

ఆరు వ‌రుస హిట్ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ల డైరెక్ట‌ర్‌గా పేరున్న యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అనిల్ రావిపూడి – బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే పిచ్చ క్రేజ్‌. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాలో చాలా ట్విస్టులు సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచుతున్నాయి. బాల‌య్య‌కు జోడీగా యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల న‌టిస్తోంది. బాల‌య్య సినిమాలో 50 ఏళ్ల పై వ‌య‌స్సు ఉన్న వ్య‌క్తిగా క‌నిపించ‌బోతున్నాడు.

దీనికి తోడు మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ క్రేజీ ప్రాజెక్టు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోంద‌ట‌. బాల‌య్య సినిమాలు అంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువుగా రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లోనే వ‌స్తున్నాయి. అందుకు భిన్నంగా ఇప్పుడు బాల‌య్య తెలంగాణ నేప‌థ్యాన్ని ఎంచుకోవ‌డం కొత్త‌గా ఉంది. సినిమాలో బాల‌య్య క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందట.

బాల‌య్య పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నా ఆ పాత్ర ఆలోచ‌న‌లు, యాక్టివిటీ అంతా ఫ‌న్నీగా ఉంటుంద‌ట‌. అనిల్ రావిపూడి అంటే ఫ‌న్నీ మూమెంట్స్ ఎక్కువ‌. బాల‌య్య అంటే రౌద్ర‌ర‌సం. అస‌లు బాల‌య్యను అనిల్ త‌న కామెడీ స్టైల్లోనే అద్భుతంగా డీల్ చేయ‌బోతున్నాడ‌నే అంటున్నారు. ఓ తండ్రి, కూతురు మ‌ధ్య ఓ ఎమోష‌న‌ల్ ట్రాక్ కూడా ఉంటుందట‌. సినిమాలో ప్లాష్‌బ్యాక్ అయితే చాలా వైల్డ్ గా ఉంటుందట. ఏదేమైనా బాల‌య్య – అనిల్ కాంబోలో ఓ స‌రికొత్త సినిమాను అయితే మ‌నం చూడ‌బోతున్నాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news