Moviesబిగ్ బ్రేకింగ్‌: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ ఇక‌లేడు

బిగ్ బ్రేకింగ్‌: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ ఇక‌లేడు

టాలీవుడ్‌లో గ‌త కొంత కాలంగా వ‌రుస‌గా విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. గ‌త యేడాది చివ‌ర్లో త‌క్కువ టైంలోనే న‌లుగురు దిగ్గ‌జ న‌టుల‌ను ఇండ‌స్ట్రీ కోల్పోయింది. న‌ట‌శేఖ‌ర కృష్ణ‌, రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు, న‌వ‌ర‌స న‌ట‌సౌర్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, చ‌ల‌ప‌తిరావు మృతిచెందారు. ఇక కృష్ణ స‌తీమ‌ణి ఇందిరాదేవి కూడా గ‌త యేడాది చివ‌ర్లోనే మృతి చెందారు. వీరితో పాటు గ‌తేడాది ప‌లువురు కీల‌క న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు కూడా అనారోగ్యాల‌తో పాటు ఇత‌ర కార‌ణాల‌తో మృతిచెందారు.

ఈ విషాదాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న టైంలో మ‌రో వ‌ర్థ‌మాన హీరో ఈ రోజు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ హీరో ఎవ‌రో కాదు సుధీర్‌. సుధీర్ ఈ రోజు వైజాగ్‌లో సూసైడ్ చేసుకున్నాడు. సుధాక‌ర్ కొమాకుల‌, చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన కుంద‌న‌పు బొమ్మ సినిమాలో సుధీర్ అనే మ‌రో హీరో కూడా న‌టించాడు.

సినిమా రంగంలో ఓ వెలుగు వెల‌గాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అత‌డికి ఇక్క‌డ అనుకున్న‌ట్టుగా అవ‌కాశాలు రాలేదు. ఆ కార‌ణంతోనే అర్ధాంత‌రంగా త‌నువు చాలించాడా ? లేదా ? వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లా ? అన్న‌ది తెలియ‌రావాల్సి ఉంది. అయితే సుధీర్‌కు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయంటున్నారు.

అత‌డి మృతిప‌ట్ల హీరో సుధాక‌ర్ కోమాకుల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అత‌డు లేడ‌న్న విష‌యాన్ని తాను జీర్ణించుకోలేక‌పోతున్నానంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ యువ‌న‌టుడు మ‌ర‌ణంపై ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news