Moviesబాలయ్య బ్యూటీ అంత తెగించిందా..? వారి మనోభావాలు దెబ్బతిన్నాయే..!!

బాలయ్య బ్యూటీ అంత తెగించిందా..? వారి మనోభావాలు దెబ్బతిన్నాయే..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా హనీ రోజ్ పేరు మారు మ్రోగిపోతుంది . అది ఏంటో తెలియదు కానీ నిన్న మొన్నటి వరకు ఈ పేరు తెలియని కుర్రాళ్లు కూడా ఇప్పుడు ఫోన్లల్లో సోషల్ మీడియాలో ..అమ్మడు పిక్ ని వాల్ పేపర్లుగా తెగ ట్రెండ్ చేస్తున్నారు . దీనంతటికీ కారణం నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా అని అందరికీ తెలిసిందే . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ సెకండ్ హీరోయిన్గా నటించింది .

హాట్ ఫిగర్ గా ఉన్న శృతిహాసన్ లాంటి బ్యూటీ నటిస్తుంది అని తెలియడంతో జనాలు హనీ రోజ్ ను లైట్గా తీసుకున్నారు . శృతిహాసన్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు . సీన్ కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత శృతిహాసన్ పేరు ఎవరు పలకడం లేదు . అందరూ హాని రోజ్ హనీరోజ్ అనే అంటున్నారు. అంతెందుకు నందమూరి బాలయ్య సైతం శృతిహాసన్ ని పక్కన పెట్టేసి ఆమె తోనే మందు కొడుతున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి .

రీసెంట్ గా చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ కుర్రాళ్లకు మంచి కిక్కేస్తుంది . ఇన్నాళ్లు ఇంత బ్యూటీ ఎక్కడ దాచావు మేము ఎలా నిన్ను మిస్ అయ్యాము.. అంటూ ఆర్జీవి కామెంట్స్ ను బయటపెడుతున్నారు . అంతేనా నీవల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ హాట్ హాట్ కామెంట్స్ పెడుతున్నారు . ఇదే కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే ఈ హనీ రోజ్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకునే విధంగా కనిపిస్తుంది అంటూ సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news